Advertisement
Google Ads BL

‘ఉత్తర’ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలివే..!


ఉత్తర  ప్రీ రిలీజ్ ఈవెంట్,జనవరి 3న గ్రాండ్ రిలీజ్

Advertisement
CJ Advs

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి 3 న విడుదలకు సిద్దం అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. కొన్ని కథలు కొన్ని జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతుంది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజకీయ ప్రముఖలు పాల్గోన్నారు.

ఈ సందర్బంగా కమెడియన్ వేణు మాట్లాడుతూ: ‘దర్శకుడు రాసుకున్న సీన్ప్ చదివిని తర్వాత ఆయనపై నమ్మకం పెరిగింది. అంత అందంగా స్ర్కిప్ట్ ని రాసారు. ఏదో ఒకరోజు షూటింగ్ అంతా కొత్త వాళ్లు అనుకుంటూ లొకేషన్ లోకి వెళ్ళిన నాకు ఈ టీంతో పనిచేయడం ట్రీట్ లాగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

అదిరే అభి మాట్లాడుతూ: ‘ఈవెంట్ లో బోకేలకు బదులు ఎవరెస్ట్ ని అధిరోహించిన పూర్ణ గురించిన బుక్ ని అతిథులకు అందించారు. దర్శకుడు తిరుపతి ఆలోచనలు అంత సున్నితంగా, లోతుగా ఉంటాయి అనడానికి ఈ ఉదాహారణ చాలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఉత్తర లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీపతి రంగదాస్ మాట్లాడుతూ: ‘సినిమా చేయాలనే కోరిక ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టాం. నా తండ్రి కోరిక మేరకు కుటుంబ బాధ్యతలు తీసుకొని బిజినెస్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా నా మనసులోంచి సినిమా పోలేదు. అందుకే తిరుపతి కలసి కథ చెప్పగానే నచ్చి వెంటనే ఓకే చేసాను. నా అంచనాలను మించి సినిమా చేసి చూపించాడు. ఈ సినిమా ప్రివ్యూకి వచ్చే సమయానికి నా తండ్రిగారు మమ్మల్ని వదిలి వెళ్ళి పోయారు. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. సినిమా యూనిట్ కి చాలామందికి నేను తెలియదు నాపేరు వినిఉంటారు. ఉత్తరలోని పాటలు చాలా బాగా వచ్చాయి. వాటిని వింటూ మా కష్టం మరిచిపోయాము. సినిమాలో ప్రయత్నించే వాళ్ళను ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శించకండి. కారుణ్య, శ్రీరామ్, దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

సమర్పకులు రవికుమార్ మాదారపు మాట్లాడుతూ: ‘ఉత్తరలో ఒక మ్యాజిక్ ఉంది. తెలంగాణా పల్లెదనం తెరమీద స్వచ్ఛంగా కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడు. మా ప్రయత్నం అందరి ఆశీస్సులు అందుకుంటుందని నమ్ముతున్నాను’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ: ‘ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో కనిపిస్తాను. మా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ గారు నేచురల్ గా కథను తెరమీదకు తెచ్చారు. శ్రీరామ్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ‘పిల్లా నా గుండెను పట్టి లాగకే’ పాటలో నా డాన్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి అమ్మాయి నా పాత్రతో రిలేట్ అవుతుంది. ఒక మంచి టీంతో పనిచేసాననే ఆనందం నాకు ఉంది. మీరు పోరులతో, పోరళ్ళతో థియేటర్ కి రండి అక్కడ కలుద్దాం. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అన్నారు.

హీరో  శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: ‘నేను సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు నాకంటే మా నాన్న నాపై ఎక్కువ నమ్మకం ఉంచేవాడు. ఆయన నమ్మకం చూసి నాకు భయమేసేది. ఇక్కడ నేను ఉన్నానంటే దానికి కారణం మానాన్న. ఒక్క పదినిముషాలు మాట్లాడి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ ని ఆయన మొదటి సినిమా ఈశ్వర్ లో అభి అన్న ఉన్నాడు. నా మొదటి సినిమాలో అభి అన్న ఉన్నాడు ఇది పెద్ద సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది. మా నటన కానీ మా దర్శకుడి పని కానీ నచ్చలేదని ఒక్కరు చెప్పినా నేను ఇండస్ట్రీ నుండి తప్పుకుంటా. అంత నమ్మకం మాకు ఉంది. కారుణ్యతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు.

కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ: ‘ఈ సినిమా టీంకి నా అభినందనలు. తెలంగాణా కథలు తెరమీద మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతికి, హీరో శ్రీరామ్ కి హీరోయిన్ కారుణ్యకి ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ: ‘సినిమా చేయడం కంటే వాటిని ప్రేక్షకులకు చేర్చడం ఎక్కువ కష్టంతో కూడుకున్న పని, ఉత్తర సినిమాకి ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా చాలా అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా ఏడ్చిన సందర్భాలున్నాయి. వంద అడుగులు ముందుకు వేస్తే, వెయ్యి అడుగులు వెనక్కి లాగిన ఫీలింగ్ కలిగేది. నాకు సపోర్ట్ గా నిలిచిన శ్రీపతి రంగదాస్, రవికుమార్ లకు చాలా థ్యాంక్స్. కథగా కంటే ఇందులోని ఫీల్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. సహజమైన తెలంగాణా మాటలు, మనుషులను తెరమీదకు తెచ్చాం. ఉత్తరలో మహిళల రక్షణపై మాట్లాడాం. నన్ను భరించిన నా టీంకి నా ధన్యవాదాలు. హీరో శ్రీరామ్, కారుణ్యల సహకారం ఈ సినిమాకు చాలా ఉంది. జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.

రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర జనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది.

సమర్పణ: రవికుమార్ మాదారపు

బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్

సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు

మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి

ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి

రైటర్: ఎన్. శివ కల్యాణ్

ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్

Uttara Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Uttara Movie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs