Advertisement
Google Ads BL

‘పల్లెవాసి’ టీజర్ వదిలారు


‘పల్లెవాసి’ టీజర్ ను ఆవిష్క‌రించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ!!

Advertisement
CJ Advs

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమై, కిరాక్ పార్టీతో అలరించిన నటుడు రాకేందుమౌళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘పల్లెవాసి’. సాయినాధ్ గోరంట్ల ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రానికి రాం ప్రసాద్ నిర్మాత‌. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా ‘పల్లెవాసి’ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా...

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -  ‘‘ఫిల్మ్ ఛాంబర్లలోనో, స్టూడియోలలోనో కాకుండా నిజమైన పుస్తక ప్రేమికుల మధ్య హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పల్లెవాసి’ సినిమా టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది.  ఈ సినిమా టీజర్ చూస్తుంటే దర్శకుడు నేటి సమాజం విస్మరించిన వ్యవసాయ రంగంపై ఒక చర్చను ముందుకు తీసుకొస్తున్నట్లు, పల్లెదనాన్ని వినూత్నంగా చిత్రీకరించారనిపిస్తోంది. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ప్రసిద్ధ పాటల రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ - ‘‘పల్లెసీమ నేపథ్యంలో మంచి కథని ఎంచుకొన్న చిత్ర బృందానికి అభినందనలు. సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు.

నటుడు రాకేందుమౌళి మాట్లాడుతూ - ‘‘అక్షరం మీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చిన నా తొలిచిత్రం టీజర్ ఆవిష్కరణ పుస్తకాల, పుస్తకాభిమానుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. పల్లెవాసి సినిమా పాటలు, మాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో పదికాలాల పాటు నిలుస్తాయి’’ అన్నారు

హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ -  “పల్లె వాసి’’ టీజర్ చూస్తుంటే.. గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతుందో” పాటకు విశ్వరూపంగా ఉంది’’ అన్నారు.

దర్శకుడు సాయినాధ్ గోరంట్ల మాట్లాడుతూ -  ‘‘ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఔట్ ఫుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా ‘పల్లెవాసి’  టీజర్ ను విడుదల చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాం’’ అన్నారు.

నిర్మాత రాం ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘భరద్వాజ గారు మా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ‘పల్లె వాసి’ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’’ అన్నారు.

కార్యక్రమంలోకెమెరామెన్ చామంతి లక్ష్మణ్ రాజ్, ద‌ర్శ‌కులు కె. సందీప్ కుమార్‌, స‌హ నిర్మాత ఉద‌య్‌కుమార్ యాద‌వ్ తదితరులు పాల్గొన్నారు.

Pallevasi Teaser Released:

Tammareddy Bharadwaja Released Pallevasi Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs