Advertisement
Google Ads BL

వైఎస్ జగన్-ఎల్వీ ఎపిసోడ్‌పై సినిమా తీయట్లేదు!


ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. నాటి ఎల్వీ సుబ్రమణ్యంపై సినిమా తెరకెక్కిస్తున్నారని రెండ్రోజులుగా జాతీయ, ప్రాంతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. వాస్తవానికి వీరిద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ‘అన్నా..’ అనుకునేంత క్లోజ్‌గా ఉన్నారు.. అయితే ఏం జరిగిందో ఏమోగానీ ఎల్వీని సీఎస్‌ను పీకేసి మానవ వనరుల ఆర్థిక సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. అయితే ఆయన తొలగింపు వెనుక చాలా పెద్ద కథే నడించింది. తొలగింపు అనంతరం గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఈ క్రమంలో సినిమా వస్తోందనడంతో ఔత్సాహికులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా చూస్తే.. అబ్బే అదేం లేదు.. అదంతా ఒట్టిపుకారేనని దర్శకుడు తేల్చిచెప్పేశారు. ఇంతకీ ఆసంగతేంటో..? డైరెక్టర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

Advertisement
CJ Advs

‘ఎర్రచీర’ సినిమా ఫేం సీహెచ్. సత్యసుమన్ బాబు ఆసక్తికర కథతో సినిమా తెరకెక్కిస్తున్నారని.. అదే వైఎస్ జగన్-ఎల్వీ ఎపిసోడ్‌ అని వార్తలు గుప్పుమన్నాయ్. ఈ వార్తలు అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. అబ్బే అవన్నీ పుకార్లేనని.. ప్రజాసమస్యలే ప్రధానంగా సినిమా తెరకెక్కించామని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారి అవినీతిపై పోరాటం చేసి పూర్తిగా అవినీతిని ఎలా అంతమొందించారు..? అని తెలియ‌జెప్పే మంచి సందేశాత్మక చిత్రమని తేల్చిచెప్పారు. అయితే దీన్ని ఓ పత్రిక జగన్-ఎల్వీ మధ్య జరిగిన ఘటన అని పొరపాటును రాసిందన్నారు. వాస్తవానికి మేం ఆ సబ్జెక్ట్ జోలికి పోలేదని.. ఆ సినిమాకు ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. మొత్తానికి చూస్తే.. పుకార్లకు సుమన్ బాబు ఫుల్ స్టాప్ పెట్టేశారన్న మాట.

Erra Cheera Director gives Clarity On Ysjagan-LV Episode Cinema!:

Erra Cheera Director gives Clarity On Ysjagan-LV Episode Cinema!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs