Advertisement
Google Ads BL

జగన్ ప్రకటనతో స్టార్ హీరో 500 ఎకరాలు ఢమాల్!


ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎవరూ ఊహించని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ మూడు రాజధానులపై సాద్యాసాధ్యాలను చూడటానికి రెండు కమిటీలను వేయడం జరిగింది. ఇప్పటికే ఓ కమిటీ అధికార వికేంద్రీకరణ కచ్చితంగా అవసరమేనని తేల్చింది. మరో కమిటీ జనవరి-03న నివేదిక అందజేయనుంది. అయితే జగన్ ప్రకటనతో అమరావతిలో భూములు కొన్న రాజకీయ, సినీ ప్రముఖులు గగ్గోలు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ స్టార్ హీరో అప్పట్లో రాజధాని అమరావతి ప్రకటించినప్పుడు ఒకట్రెండు కాదు ఏకంగా 500 ఎకరాలు కొనేశాడట. 

Advertisement
CJ Advs

ఆ 500 ఎకరాల్లో ఎంచక్కా స్టూడియో నిర్మించేసి బతికేయొచ్చని భావించిన ఆయనకు.. జగన్ ప్రకటనతో నిద్ర కరువైందట. వామ్మో.. 500 ఎకరాల భూమి ఢమాల్ అన్నదే అని ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు తిరిగి దండం పెట్టుకుంటున్నాడట. అయితే ఆయన టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోనట. ఎవరనేది మాత్రం బయటికి ఒకట్రెండు పేర్లు వస్తున్నప్పటికీ పక్కాగా తెలియట్లేదు. అప్పట్లో చాలా తక్కువ రేటుకే కొన్న ఆయన భూములు.. కొద్దిరోజులు తర్వాత కోట్లు పలికాయట. ప్రస్తుతం మాత్రం కోట్లు కాస్త లక్షలే పలుకుతున్నాయట.

వాస్తవానికి ఏ హీరో అయినా.. నిర్మాత అయినా.. డైరెక్టర్ అయినా ఒక సినిమా హిట్టయితే మరోదానిపై ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే ఇలాగే హైదరాబాద్‌లో ఇదివరకే స్టూడియో ఉన్న స్టార్ హీరో.. నవ్యాంధ్ర రాజధానిలో కూడా అందరికంటే ముందుగా స్టూడియో కట్టేద్దామనే ఆర్భాటంతో ఇలా 500 ఎకరాలు కొన్నారట. తీరా చూస్తే.. జగన్ సడన్‌గా మూడు రాజధానుల ప్రకటన చేయడంతో కంగుతిన్నారట. మరి ఆ హీరో ఎవరు..? ఎందుకు అన్నె్సి ఎకరాలు కొన్నారు..? అనేదానిపై అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆ టాప్ కమ్ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Tollywood Top Hero Loss.. While Ys Jagan Announcement!:

Tollywood Top Hero Loss.. While Ys Jagan Announcement!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs