Advertisement
Google Ads BL

మూవీ మొఘల్ దగ్గుబాటి ఇంట్లో భారీ చోరీ!?


టాలీవుడ్‌ను ఒకప్పుడు ఏలిన మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో దొంగలు పడ్డారని సమాచారం. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడిన దుండగులు భారీగా దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటికి పొక్కితే పరువుపోతుందని భావించిన దగ్గుబాటి ఫ్యామిలీ మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేస్తోందని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికి తెలుస్తుందేమో.. మీడియా హడావుడి చేస్తుందేమోనని భావించిన సురేష్ బాబు ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారట.

Advertisement
CJ Advs

కాగా.. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు రామ్మోహన్ రావుకు ప్రకాశం జిల్లాలోని కారంచేడులో సొంత ఇల్లు ఉంది. అయితే అక్కడికి పండుగలకు లేదా వీలు దొరికినప్పుడు వెళ్లి వస్తుండేవారు. ఇటీవలే ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ఈ క్రమంలో కొత్తవాళ్లున్నారు కదా అని భావించిన దొంగలు.. పంట పండుతుందని ఇంట్లోకి చొరబడ్డారట. ఇంట్లోని బీరువాలు, అలమరాలు బద్ధలు కొట్టిన దొంగలు గట్టిగానే దోచుకున్నారట. ఐదు సవర్ల బంగారంతో పాటు 15 కిలోల వెండి, రెండు లక్షలకు పైగా నగదు.. ఇలా చాలా వస్తువులే ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. అయితే.. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా శనివారం మధ్యాహ్నం ఇంట్లో పని పనిషి గుర్తించి దగ్గుబాటి కుటుంబ సభ్యులకు చెప్పారట. ఈ ఘటన అనంతరం దగ్గుబాటి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారట. 

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ బడా బాబుల ఇళ్లలో దొంగతనాలు జరగడం ఇదేం కొత్తకాదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున.. మోహన్ బాబు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. అయితే తాజాగా దగ్గుబాటి ఇంట్లో ఇలా జరగడం అందర్నీ కలవరపెడుతోందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Stolen in Daggubati Ramanaidu house!!:

Stolen in Daggubati Ramanaidu house!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs