Advertisement
Google Ads BL

‘దిశ’ సినిమాలో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..!


హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వైద్యురాలిపై జరిగిన హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు కామాంధులను నడిరోడ్డుపై ఉరితీసి చంపాల్సిందేనని లేదా ఎన్‌కౌంటర్ చేయాల్సిందే అని డిమాండ్స్ ఎక్కడ చూసినా వినిపిస్తూ.. కనిపినిపించింది. అయితే యాదృచ్ఛికమో ఏమోగానీ అనుకున్నట్లే అక్షరాలా అదే జరిగింది. అయితే ఈ దిశపై అత్యాచార ఘటన జరిగినప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సినీ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ కాస్త వెరైటీగా స్పందించింది. ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తెలంగాణా పోలీసుల తీరుపై పలువురు ప్రసంశల వర్షం కురిసింది. అంతేకాదు.. పోలీసులపై ప్రజలు పూల వర్షం కురిపించారు. 

Advertisement
CJ Advs

ఇదలా ఉంచితే ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా టాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. ఈ సినిమాను తెరకెక్కించడానికి తమిళ దర్శకుడు శరవణ సిద్దమయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఇప్పటికే ఆయన కథ కూడా దాదాపు పూర్తి చేసుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రకోసం ఎవరైతే సెట్ అవుతారని నిశితంగా ఆలోచించినగా డైరెక్టర్.. సమంత అక్కినేనిని సంప్రదించగా ఆమె సమాజానికి ఇలాంటి సినిమాలే కావాలని.. తాను సిద్ధంగా ఉన్నానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అనగా.. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కాగా.. ఇప్పటికే  లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పించిన సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ పుకారులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Samantha Akkineni ready to Act as Hyderabad Disha!:

Samantha Akkineni ready to Act as Hyderabad Disha!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs