Advertisement
Google Ads BL

ముద్దు సీన్‌కు వణికిపోయిన స్టార్ హీరోయిన్!


టాలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలోనే ఓ వెలుగు వెలుగుతూ స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది పూజా హెగ్దే. ఈ బ్యూటీకి టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ ఆఫర్లే.. ఆపర్లు వచ్చేస్తున్నాయ్. అలా వరుస ఆఫర్లుతో పూజా పాప యమా స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఈ ముద్దుగుమ్మ కాల్షీట్స్ కోసం దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ‘మొహంజదారో’ చిత్రంలో హృతిక్ రోషన్‌ సరసన ఈ బ్యూటీ రొమాన్స్ చేసింది. ఇందుకు సంబంధించి ఈ భామ తాజాగా జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement
CJ Advs

ముద్దు సీన్లు తెరపై చూడటానికి చాలా బాగుంటాయ్.. ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఆ సీన్లలో నటించేందుకు నటీనటులు ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చింది. నేను నటించిన ‘మొహంజదారో’ సినిమాలో హృతిక్‌తో ముద్దు సీన్ ఉందని షూట్‌కు చాలా ఇబ్బంది పడ్డానని.. దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ తనకు వివరించగా లిప్‌లాక్ సిద్ధమయ్యానని చెప్పింది. అయితే తారా షూట్ దాకా వెళ్లేసరికి తనకు వణుకు పుట్టిందని చెప్పుకొచ్చింది. వాస్తవానికి తాను ఇంతకు ముందు లిప్‌లాక్ సీన్స్ చేయలేదని చెప్పింది.

అంతేకాదు.. ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు షూటింగ్‌లతో తనకు చుట్టూ చాలా మంది జనాలు ఉంటారని.. అలాంటి సమయంలో కిస్ చేయాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పింది. ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమని తోటి హీరోయిన్స్‌కు ఈ బ్యూటీ పాఠాలు చెబుతోంది.!. అందుకే కెమెరా ట్రిక్‌లు కూడా ఇలాంటి సన్నివేశాల్లో చాలా ఉపయోగపడతాయని పూజా హెగ్దే తనకు ఎదురైన అనుభవాలను ఇంటర్వ్యూ వేదికగా స్పష్టం చేసింది.

Star Heroine Fears Kiss Scene!!:

Star Heroine Fears Kiss Scene!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs