Advertisement
Google Ads BL

అయ్యో పాపం.. షాలిని పాండే!!


ఈ ఏడాది కళ్యాణ్ రామ్ తో 118 అంటూ అలరించిన షాలిని పాండే.... ఆ సినిమాలో సో సో కేరెక్టర్ చేసినా.. హిట్ అయ్యిది కాబట్టి.. షాలిని పాండే కి రాజ్ తరుణ్ సరసన ఇద్దరిలోకం ఒకటే సినిమా అవకాశం ఇచ్చారు. అర్జున్ రెడ్డిలో బోల్డ్‌గా, మహానటిలో సావిత్రి ఫ్రెండ్ గా ట్రెడిషనల్ గా, 118 లో కళ్యాణ్ రామ్ కాబోయే భార్య గా చక్కని నటన కనబర్చింది. కాకపోతే అర్జున్ రెడ్డి తర్వాత క్రేజ్ పెరిగి ఎక్కడో ఉంటుంది అనుకుంటే... షాలిని కి అవకాశాలే రాలేదు. ఇక తమిళనాట చేస్తున్న సినిమాల్తో షాలిని కి సమస్యలు. మరోపక్క బాలీవుడ్ రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో సినిమాలో షాలిని కి కేరెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక షాలిని పాండే తాజాగా నటించిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమా విడుదల కావడం.. నెగటివ్ టాక్ రావడం జరిగింది. అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో షాలిని పోటీ పడి నటించింది అనే చెప్పాలి.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో షాలిని పాండే నటనపై క్రిటిక్స్ రకరకాలుగా కామెంట్ చేశారు. ఒకరు... సినిమా మొత్తంలో మంచి పెర్ఫామర్ ఎవరైనా ఉన్నారంటే అది షాలిని పాండేనే. తన పాత్ర ఎంత పేలవంగా అయినా ఉండనీ.. ఆమె మాత్రం చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది. షాలిని మంచి నటి అనే విషయం కొన్ని కొన్ని సన్నివేశాల్లో అద్దంలా కనిపిస్తుంది. అయితే దర్శకుడు ఆమె టాలెంటుని ఉపయోగించుకోలేకపోయాడు. అంతేకాకుండా షాలిని పాండే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అందంగా కూడా కనిపించింది. చూడ్డానికి క్యూట్‌గా వుంది. ఇక మరొకరు షాలిని పర్‌ఫార్మెన్స్‌ జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. లుక్ వైజ్ బాగానే ఉన్నా.. సీన్లలో దమ్ములేక నటన పండలేదు... అంటూ షాలిని పాండే నటనను కామెంట్ చేశారు. మరి షాలిని పాండే కి ఈ సినిమా తప్ప తెలుగులో మరో అవకాశం లేదు. ఇక బాలీవడో లో ఏమైనా క్లిక్ అవుతుందేమో చూద్దాం.

Interesting News About Arjun Reddy Actress Shalini Pandey!:

Interesting News About Arjun Reddy Actress Shalini Pandey!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs