Advertisement
Google Ads BL

RRR ఫస్ట్ లుక్, టైటిల్‌‌కు ముహూర్తం ఫిక్స్!


బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు 70% సినిమాకు పైగా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోవచ్చినప్పటికీ ఇప్పటికీ సింగిల్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో గాసిప్స్ పెద్ద ఎత్తున వస్తుండటంతో అసలు వేటిని నమ్మాలో..? వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ‘RRR’ యూనిట్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అటు ఎన్టీఆర్.. ఇటు చెర్రీ.. మరోవైపు జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే అప్డేట్‌కు టైమొచ్చేసింది.. అంతేకాదండోయ్.. ముహూర్తం కూడా ఫిక్సయ్యింది!. 

Advertisement
CJ Advs

సినిమా షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ సినిమా టైటిల్‌గానీ.. సింగిల్ లుక్‌గానీ బయటికి రాలేదు. దీంతో అటు ఎన్టీఆర్.. ఇటు చెర్రీ.. మరోవైపు జక్కన్న వీరాభిమానులు కాసింత అసంతృప్తికిలోనయ్యారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’, ‘టైటిల్‌’ని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయాలని చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసుకుందని సమాచారం. అంటే చెర్రీ, జూనియర్, జక్కన్న అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న మాట. ఇది నిజంగానే ఆ ఇద్దరూ హీరోల అభిమానులకు తియ్యటి శుభవార్తే.

ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆ వీరులకు సంబంధించి ముఖ్యమైన రోజుల్లో కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు కానీ.. న్యూ ఇయర్‌ కానుగా ఇస్తున్నారన్న మాట. ఇప్పటికే ఇదుగో ఫలానా రోజు లుక్ వచ్చేస్తోందని వార్తలు వినడం.. వేచి చూడటం ఫ్యాన్స్‌కు మామూలైపోయింది. మరి ఈసారైనా పక్కాగా.. రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్-31 అర్ధరాత్రి వరకు వేచి చూడక తప్పదు.. వెయిట్ అండ్ సీ.

Muhurtham Fixed For RRR Movie First Look, Title:

Muhurtham Fixed For RRR Movie First Look, Title  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs