Advertisement
Google Ads BL

ఈ యాంకరమ్మకు కాస్త నేర్పించండ్రా బాబూ..!


తెలుగు కామెడీ షోలో నంబర్‌వన్‌గా నిలిచిన ‘జబర్దస్త్’కు మెగా బ్రదర్ నాగబాబు గుడ్ బై చెప్పేసిన అనంతరం జీ తెలుగులో ‘అదిరింది’ అనే కామెడీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ షోకు యాంకర్‌గా ఎవరైతే సెట్ అవుతారని వెతగ్గా ఎవరూ దొరక్కపోవడంతో ప్రస్తుతానికి సమీరను పట్టుకొచ్చారు. అయితే ఈ యాంకరమ్మ ఎన్నిరోజులు ఉంటుందో కూడా సరిగ్గా తెలియదనుకోండి. ఇన్ని రోజులూ ‘ఆడపిల్ల’, ‘అభిషేకం’, ‘భార్యామణి’, ‘ప్రతిబింబం’, ‘మంగమ్మ గారి మనవరాలు’ సీరియల్స్‌లో నటించిన సమీర తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ సీరియల్సేనా అనుకుందో ఏమోగానీ.. యాంకరమ్మగా అవకాశం రావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీ స్టూడియోలో దూకేసింది!.

Advertisement
CJ Advs

అయితే.. వచ్చీ రాగానే జబర్దస్త్‌కు యాంకర్స్‌గా వ్యవహరిస్తున్న రష్మీ, అనసూయలాగా తనకూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. వారితో పోటీ పడాలని తహతహలాడుతోంది. ఎంట్రీ సాంగ్స్, మధ్య మధ్యలో డైలాగ్స్, అప్పుడప్పుడు ఆ నవ్వు.. అలా ప్రస్తుతానికి గడిపేస్తోంది. అయితే ఈ యాంకరమ్మపై నెటిజన్లు, అదిరింది ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె నవ్వు.. ఏదో పళ్లు ఇకిలించి అలా నవ్వేస్తోందే తప్ప మరేమీ లేదని.. ఓహ్ ఇది నవ్వే డైలాగా అయితే నవ్వేద్దాం అన్నట్లుగా ఉంది కానీ.. మనస్పూర్తిగా నవ్వట్లేదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకొందరైతే అయ్యా షో డైరెక్టర్స్ కాస్త ఈమెకు నవ్వడం, పంచ్ డైలాగ్స్ నేర్పించండి మహా ప్రభో అని కామెంట్స్ రూపంలో వేడుకుంటున్నారు. అక్కడక్కడా స్కిట్ మధ్యలో డైలాగ్స్ వేయాలని సమీర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవీ పేలకపోగా.. రివర్స్ అవుతున్నాయ్. 

ఫస్ట్ షోలో.. ‘ఈ మొగుళ్లు మనకు అవసరమా.. సమీరా?’ అని అడగ్గా.. ‘పడి ఉండనీయే.. అప్పుడప్పుడూ ఉపయోగపడతారు’ అని వల్గర్‌గా పంచ్ వేసింది. అయితే డైరెక్టర్స్ ఇలా రాశారా లేకుండా ఈ అమ్మడి సొంత ప్రయోగమే తెలియదు కానీ.. ఈమెపై మాత్రం ట్రోలింగ్ గట్టిగానే అవుతోంది. ఇలాంటి పిచ్చిపిచ్చి వల్గర్ డైలాగ్స్ కాకుండా కాస్త అదిరిపోయేలా ఉండేవి రాయండి డైరెక్టర్స్ అంటూ వీక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. సో.. మొత్తమ్మీద చూస్తే.. ఇప్పుడిప్పుడే యాంకర్‌గా రాణిస్తున్న సమీర చాలానే నేర్చుకోవాలన్న మాట. మార్పు మంచిదే.. కొత్త కొత్త విషయాల నేర్చుకుంటే ఇంకా మంచిది.. ఎంతైనా పోటీ ప్రపంచం కదా సమీరా.. ఇక మారిపోండి!.

News About ADIRINDI Anchor Sameera!:

News About ADIRINDI Anchor Sameera!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs