Advertisement
Google Ads BL

హీరోయిన్‌ను ఒకే రోజు ఇద్దరు డేట్‌కు పిలవడంతో..


బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకూ రాధికా ఆప్టే పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. స్క్రిప్ట్ డిమాండ్స్‌ని బట్టి ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించేందుకు ఈమె ముందు వరుసలో ఉంటారు గనుక. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని కొన్ని బోల్డ్ సీన్లలో నటించడానికి కొందరు హీరోయిన్స్ జంకుతారు కానీ.. ఈమె మాత్రం ఈజీగానే నటించేస్తుంది. పెళ్లికి ముందే ఇలానే చేస్తుండేది.. ఇప్పుడూ ఇలానే చేస్తోంది. పెళ్లయితేనేం అస్సలు తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా ఈ హాట్ బ్యూటీ నటిస్తోంది. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జరిగిన విషయాలు, భర్త గురించి ఇలా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement
CJ Advs

‘నేనెప్పుడూ నా కంటే చిన్న వయసున్న వారితో డేటింగ్ చేయలేదు. పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్యాయిలు నన్ను డేటింగ్‌కు రమ్మని పిలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు నా భర్త బెనెడిక్ట్. అయితే ఒకేసారి ఇలా ఇద్దరు పిలవడంతో ఏం చేయాలో.. అసలు ఏం నిర్ణయం తీసుకోవాలనే తనకు తోచలేదు. ఫైనల్‌గా నా రూమ్‌మేట్‌కు విషయం చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నాం. టూనా చేపను వండి రోజూ మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టాలనుకున్నాం. పిల్లి ఆ వంటకం తింటే బెనెడిక్ట్‌తో.. లేకుంటే మరో కుర్రాడితో డేటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ పిల్లి రావడం చేపను తినడం.. నేను బెనెడిక్ట్‌తోనే డేటింగ్ వెళ్లడం.. మా మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి’ అని రాధికా చెప్పుకొచ్చింది. డేటింగ్ కోసం ఇద్దరు పోటీ పడగా.. ఈ భామ కూడా బెట్టింగ్ తరహాలో పిల్లికి వంట పెట్టిందన్న మాట. సో.. మొత్తానికి చూస్తే అలా డేటింగ్ మొదలైన ఈ వ్యవహారం పెళ్లయ్యి హ్యాపీగా సాగుతోంది. ఈ ఆసక్తికర విషయం విన్న రాధికా, బెన్‌ అభిమానులు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Radhika Apte Decided to First Date Benedict as a cat ate tuna..:

Radhika Apte Decided to First Date Benedict as a cat ate tuna..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs