Advertisement
Google Ads BL

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ పెద్ద హిట్ అవ్వాలి-యాంక‌ర్ సుమ‌


‘జబర్దస్త్‌’, ‘ఢీ’, ‘పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా.. ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, స్టార్‌ యాంకర్ సుమ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, యాంక‌ర్‌ ప్రదీప్, రవితో పాటు జబర్దస్త్, ఢీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ అదిరిపోయే స్టెప్పులతో పాటు పాట పాడి ఫ్యాన్స్‌ని అలరించారు.

Advertisement
CJ Advs

ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘శేఖర్ రాజు గారు సైకిల్ మీద హైదరాబాద్ కి వచ్చి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఇప్పుడు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా ద్వారా తాను నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతోమందికి మంచి దారి చూపించాడు. ఈ సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉండొచ్చు కానీ మూవీ చాలా హార్డ్ గా ఉంటుంది. దర్శకుడు రాజశేఖర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే రైతుల గురించి మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చారు. సుధీర్ డాన్సులతో పాటు ఫైట్స్ ఇరగదీసాడు. డిసెంబర్ 28 న ప్రతి ఒక్కరూ సినిమా చూడండి’ అన్నారు.

ముఖ్య అతిధి నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నాకు సుధీర్‌లో సుడిగాలి తెలుసు కానీ ఇప్పుడు సుడిగాలిని ఎదురుగా చూస్తుంటే ఒక ప్రభంజనంలా ఉంది. సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అన్నింటికి మించి తనకున్న ఫాలోయింగ్ ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. డిసెంబర్ 28 సినిమా కోసం మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘నేను ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోల‌ ఈవెంట్ లకి వెళ్ళాను వాటితో ఈక్వల్ గా ఉంది ఈ ఫంక్షన్. డెఫినెట్ గా సుధీర్ మంచి హీరో అవుతారు. ఫారెన్ లో కూడా సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ‘నేను రాజశేఖర్ రెడ్డి ఒకే రూమ్ లో ఉండేవాల్లం. మా ఇద్దరిది అన్నదమ్ముల బంధం. ఇప్పుడు సుధీర్ హీరోగా వస్తోన్న సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ ద్వారా దర్శకుడిగా పరిచయం అవడం చాలా  సంతోషంగా ఉంది. ఈ సినిమాకి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు.

లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ.. ‘బొంబాయి పోతావా రాజాతో భీమ్స్ గారు నాకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కోయం బత్తూరు పీసు, ఇంత అందమే, ఐడెంటిటీ కార్డు అనే మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలు మంచి పేరు తెస్తాయని నమ్మకం ఉంది’ అన్నారు.

ముఖ్య అతిధి యాంకర్ సుమ మాట్లాడుతూ.. ‘ఈ షోకి హోస్ట్‌గా వద్దామనుకున్నా కానీ గెస్ట్‌గా వచ్చాను. కథా కథనాలు బాగుండి దానికి మంచి కాస్టింగ్ తోడయితే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ‘యాక్టింగ్‌లో కానీ డాన్సులతో కానీ ప్రతి రోజు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా.  సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.

చిత్ర నిర్మాత కె శేఖర్‌ రాజు మాట్లాడుతూ.. ‘మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ. సుధీర్‌ని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. మూవీ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.

చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో కథ కన్నా కొందరి జీవితాలు కనిపిస్తాయి. ఫస్ట్ కాపీ చూశాను. తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ వచ్చింది. డా.శివ ప్రసాద్ గారి గురించి  మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఆయన మనమధ్య లేరు. ఆయనకు ఫోన్ చేసి మంచి రోల్ ఉంది సర్ మీరు తప్పకుండా చేయాలి అంటే ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చి నటించారు. రేపు చనిపోతారన‌గా ఈరోజు నటించడానికి కూడా సిద్ధమయ్యారు. నటన అంటే ఆయనకు అంత ఫ్యాషన్, మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నా మొదటి సినిమాకే గొప్ప ప్రొడ్యూసర్‌ దొరికినందుకు హ్యాపీగా ఉంది. భీమ్స్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఆయనలోని అన్ని ఎనర్జీలను ఈ సినిమాలో వాడడం జరిగింది. ధన్య బాలకృష్ణ చాలాబాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కథ నచ్చి ఒక పాట పాడి అందులో నటించడం జరిగింది.  అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేయడం జరిగింది. డిసెంబర్ 28న అందరూ సినిమా చూసి  తప్పకుండా సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు.

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ .. ‘నా ఫస్ట్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. సినిమాకి ఇది కావాలి అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వచ్చిన మా నిర్మాత శేఖర్ రాజు గారికి స్పెషల్ థాంక్స్. ఆయన కూడా ఈ సినిమాలో  మంచి క్యారెక్ట‌ర్ చేశారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్‌ మీద చూసి చెప్పాలి.  మీ మీడియా సపోర్ట్‌ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరూ చూడండి’అన్నారు

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

I Wish ‘Software Sudheer’ A Big Hit -Star Anchor Suma:

I Wish ‘Software Sudheer’ A Big Hit -Star Anchor Suma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs