Advertisement
Google Ads BL

దిల్ రాజు కూడా కాపాడలేకపోయాడు!


ఈ క్రిస్మస్ సందర్బంగా టాలీవుడ్‌లో ‘మత్తువదలరా’ అనే చిన్న సినిమాతో పాటుగా దిల్ రాజు స్కూల్ నుంచి ప్లాప్ హీరో రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే..’ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. గత శుక్రవారం విడుదలైన ప్రతి రోజు పండగే నిన్నటివరకు నిలకడ కలెక్షన్స్ ఉంటే.. తాజాగా విడుదలైన ‘మత్తువదలరా’ సినిమాకి హిట్ టాక్ పడగా.. వరస ప్లాప్స్ కొడుతున్న రాజ్ తరుణ్‌కి ఈ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాతో మరోసారి ప్లాప్ టాక్ పడింది. దిల్ రాజు బ్యానేర్‌లో తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒక్కటే..’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న రాజ్ తరుణ్‌కి ఆ సినిమా కూడా ప్లాప్ అవడంతో.. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ‘మత్తువదలరా..’ సినిమా చిన్న సినిమాగా వచ్చి.. అందరిలో ఆసక్తి పెంచడమే కాదు.. ఈ సినిమాకి కామెడీ హిట్ టాక్ పడడంతో.. ప్రేక్షకులు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే.. ‘మత్తువదలరా’ సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్‌కి తప్ప బిసి సెంటర్స్‌కి ఎక్కే సినిమా కాదు. ఇక రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒక్కటే..’ సినిమా మాత్రం అసలు బాగోలేదంటూ ప్రేక్షకులు, రివ్యూ రైటర్స్ చెబుతున్నారు. సినిమాలో రాజ్ తరుణ్, షాలిని పాండే నటన బావున్నప్పటికీ.. కథనం, కథ, సాగదీత సన్నివేశాలు బాగా ఇబ్బంది పెట్టాయని, ఇక పాట చిత్రీకరణ సూపర్ అయినా.. పాటలు అంతగా లేకపోవడం మైనస్ అని అందుకే సినిమా అంత ఇంట్రెస్ట్‌గా లేదంటున్నారు ప్రేక్షకులు. అసలు రాజ్ తరుణ్ ఏ పాయింట్ న‌చ్చి ఈ క‌థ చేశాడో అర్థం కాదు. ఒక వేళ ఈ సినిమా హిట్ అయినా, త‌నలోని న‌టుడికీ, త‌న కెరీర్‌కీ ఉప‌యోగ‌ప‌డే సినిమా కాదు. మరి ఈ సినిమా తో రాజ్ తరుణ్‌కి లైఫ్ ఇవ్వబోయి దిల్ రాజు రిస్క్‌లో పడ్డాడు. రాజ్ తరుణ్ వరస ప్లాప్స్ లిస్ట్‌లో ఈ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ కూడా చేరినట్లే.

News About Super Hit Movies Producer Dil Raju:

News About Super Hit Movies Producer Dil Raju  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs