Advertisement
Google Ads BL

మహేశ్‌ కోసం కథ సిద్ధం.. త్వరలోనే సినిమా!


యంగ్ డైరెక్టర్ పరశురామ్ ‘గీత గోవిందం’ సినిమాతో తన సత్తా ఏంటో టాలీవుడ్‌కు చాటి చెప్పాడు. సినిమా అయితే హిట్టయ్యింది కానీ తదుపరి సినిమా తెరకెక్కించడానికి మాత్రం లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అలా ల్యాంగ్ తర్వాత ఎట్టకేలకు సూపర్‌స్టార్ మహేశ్ బాబును ఒప్పించి సినిమా తెరకెక్కించాలని పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ ప్రయత్నాలు దాదాపు సక్సెస్ అయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య కథ వినిపించాడని మహేశ్ నచ్చిందని చెప్పడంతో పరశురామ్ రంగం సిద్ధం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేశాయ్. అయితే తాజాగా.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పరుశురామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement
CJ Advs

‘మహేశ్‌తో చేయబోయే సినిమాకు కథ సిద్ధంగా ఉంది. నాగచైతన్య మూవీ పూర్తయిన వెంటనే మహేశ్‌తో సినిమాను ప్రారంభిస్తాను’ అని చెప్పుకొచ్చాడు. పరుశురామ్ అంత ధీమాగా చెబుతున్నాడంటే మహేశ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న మాట. అంటే ఇది మహేశ్ వీరాభిమానులకు ఒకింత సంతోషం కలిగించే విషయమే అన్న మాట. కాగా.. మొదట మహేశ్‌తో అనుకున్న పరుశురామ్.. వర్కవుట్ కాకపోయే సరికి ప్రభాస్, అల్లు అర్జున్‌లాంటి పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్ చేయాలని ప్రయత్నాలు గట్టిగానే చేశాడు. అయితే ఆ ముగ్గురు హీరోలు బిజిబిజీగా ఉండటంతో వర్కవుట్ అవ్వలేదు.

ఎట్టకేలకు మహేశ్‌ను స్టోరీ లైన్ చెప్పి.. పరుశురామ్ అనుకున్నది సాధించాడట. అందుకే ఇంత ధీమాగా మహేశ్‌తో సినిమా ఉంటుందని చెబుతున్నాడని తెలుస్తోంది. కాగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేశ్ కోసం చాలా మందే దర్శకులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. మరి వారందర్నీ కాదని పరుశురామ్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? అనేది హాట్ టాపిక్‌గానే మారింది. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే అటు ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్.. ఇటు నాగ చైతన్యతో సినిమా పూర్తయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Story Ready For Mahesh Babu.. Soon Cinema Will Starts.. Here Details..!:

Story Ready For Mahesh Babu.. Soon Cinema Will Starts.. Here Details..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs