Advertisement
Google Ads BL

హ్యాట్రిక్ కోసం హిట్ చిత్రాల దర్శకుడితో కార్తి!


2019 ఏడాది చాలా మంది హీరోలకు అచ్చి రాలేదు కానీ.. తమిళ హీరో కార్తికి మాత్రం బాగానే కలిసొచ్చింది. వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ సినిమాలు వరుసగా సూపర్ హిట్టయ్యాయి. ఒక్క తమిళంలోనే కాదు.. తెలుగులోనూ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడీయన పేరు మార్మోగుతోంది. అంతేకాదు.. కార్తి టైమ్ నడుస్తుండటంతో ఆయన కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. వరుసగా రెండు హిట్‌లు కొట్టిన కార్తి హ్యాట్రిక్ మూవీ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన మిత్రన్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

Advertisement
CJ Advs

మిత్రన్ ఇప్పటికే విశాల్‌తో ‘అభిమన్యుడు’, శివకార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలు చేయగా అవి రెండూ కూడా హిట్టయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కోసం మిత్రన్ వెయిటింగ్‌లో ఉండగా.. కార్తితో అయితే అది సాధ్యమని భావించి సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇటు డైరెక్టర్.. అటు హీరో ఇరువురూ హ్యాట్రిక్ కోసం వెయిటింగ్‌లో ఉండటం.. హ్యాట్రిక్ పడితే పరిస్థితులు మారిపోతాయని భావిస్తుండగా.. మంచి కాంబోనే సెట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

కాగా.. ఈ సినిమాలో డబుల్ రోల్‌లో కార్తి చేయనున్నట్లు లీకులు వస్తున్నాయ్. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ‘కాష్మోరా’ సినిమాలో కార్తి డబుల్ రోల్‌లో నటించి మెప్పించగా.. మరోసారి నటించనున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కార్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తవ్వగానే మిత్రన్‌తో కలిసి కార్తి సెట్స్‌ పైకి వెళ్తాడని తెలుస్తోంది. అయితే ‘ఖైదీ’గా వచ్చి ‘దొంగ’గా మెప్పించిన కార్తి ఈసారి ఎలా వస్తారో..? అభిమానులను ఎలా మెప్పిస్తారో..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Karthi Movie With Hit Cinemas Director.. Details Here..!:

Karthi Movie With Hit Cinemas Director.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs