Advertisement
Google Ads BL

బాహుబ‌లి నిర్మాతల ‘ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య’..


తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్షకులు గ‌ర్వప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్టర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు వెంట‌నే మ‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

Advertisement
CJ Advs

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’ చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ స‌క్సెస్, ‘బ్రోచెవారెవ‌రురా’ సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టుడు స‌త్యదేవ్ కంచ‌ర‌న ఇందులో హీరోగా న‌టిస్తున్నారు.

వేదం వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని నిర్మించిన ఈ అగ్ర నిర్మాత‌లు ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శోభు యార్లగ‌డ్డ మాట్లాడుతూ.. ‘వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శకుడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మకంతో సినిమాను స్టార్ట్ చేశాం’ అన్నారు. 

వెంక‌టేశ్ మ‌హ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

న‌టీన‌టులు :-

స‌త్యదేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్రసాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు :-

ద‌ర్శక‌త్వం:  వెంక‌టేశ్ మ‌హ‌

నిర్మాత‌లు:  శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్రవీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్‌)

సంగీతం:  బిజ్‌బ‌ల్‌

కెమెరా:  అప్పు ప్రభాక‌ర్‌

Care Of Kancharampalem Director Movie With Bahubali Producers:

Care Of Kancharampalem Director Movie With Bahubali Producers  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs