Advertisement
Google Ads BL

సాయి తేజ్ దృష్టిలో ఆ ముగ్గురే బెస్ట్ అంట!!


ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ డాన్సర్ ఎవరనగానే మెగాస్టార్ చిరంజీవి పేరే చెప్తారు. చిరంజీవి బ్రేక్ డాన్స్ గురించే మాట్లాడేవారు. చిరంజీవిని తలదన్నే డాన్సర్ టాలీవుడ్ లోనే లేడు. అయితే ప్రస్తుతం ఈ జెనరేషన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో పోటీ పడి డాన్స్ చేసే హీరోలే లేరు. ముగ్గురూ మూడు డిఫరెంట్ స్టయిల్స్‌తో ఇరగదీస్తారు. తాజాగా ఇదే విషయం మెగా హీరో సాయి తేజ్ కూడా ఒప్పుకున్నాడు. ‘ప్రతి రోజూ పండగే’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సాయి తేజ్ రీసెంట్‌గా అలీ తో జాలిగా ప్రోగ్రాం కి రావడం అక్కడ అలీ అడిగిన ప్రశ్నలు సమాధానాలు కాస్త ఫన్నీగానే చెప్పాడు. ఇక మొదటి నుండి చిరంజీవి గారి డాన్స్ కి ఫిదా అయ్యేవాడినని చెప్పిన సాయి తేజ్.. ఇండస్ట్రీలో టాప్ డాన్సర్ ఎవరు అనగానే టాక్ మని ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ పేర్లు చెప్పేసాడు.

Advertisement
CJ Advs

డాన్స్‌లో ఆ ముగ్గురి తర్వాతే ఎవరైనా అంటూ కితాబునిచ్చేసాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్‌ల్లో డిఫ్రెంట్ వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ క్రేజీగా క్లాసిక్ టచ్ ఇస్తే... రామ్ చరణ్ డాన్స్ చాలా గ్రేస్ ఫుల్‌గా ఉంటుందని.. ఇక అల్లు అర్జున్ అయితే... డిఫరెంట్ స్టెప్స్‌తో అదరగొట్టేస్తాడని.. తన దృష్టిలో ఈ ముగ్గురూ బెస్ట్ డాన్సర్స్ అని సర్టిఫికెట్స్ ఇచ్చేసాడు సాయి తేజ్. ఇక సాయి తేజ్ కూడా మంచి డాన్సర్ అన్న సంగతి ఆయన సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. మేనమామల డాన్స్ స్టెప్స్‌ని సాయి తేజ్ యాజిటీజ్‌గా చేసేస్తుంటాడు.

Sai Dharam Tej Talks About Best Dancers In Tollywood:

Sai Dharam Tej Talks About Best Dancers In Tollywood  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs