బాలకృష్ణ - బోయపాటి బడ్జెట్ విషయంలో ఏదో జరుగుతోందని www.cinejosh.com ఎక్స్‌క్లూజివ్‌గా న్యూస్ ఇచ్చేసింది. నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి.. బాలయ్య ‘రూలర్’ సినిమా దెబ్బకి.. బోయపాటితో తీయబోయే బాలకృష్ణ సినిమాకి బడ్జెట్ కోత విధించడానికి రెడీ అయ్యాడని అన్నారు. 70 కోట్ల నుంచి 50 కోట్లకి బడ్జెట్ కోత పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా.. రవీంద్ర రెడ్డి నిజంగానే బోయపాటి-బాలయ్య సినిమా విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడని, బోయపాటికి ఫిక్స్ చేసిన 15 కోట్ల పారితోషకం, బాలకృష్ణకి ఫిక్స్ చేసియాన్ 10 కోట్ల పారితోషకాలను హోల్డ్‌లో పెట్టి.. బడ్జెట్ విషయంలో లెక్కలేస్తున్నాడని.. ఇక దర్శకుడు, హీరో పారితోషకాలను పక్కన పెట్టేసి ఆ ఇద్దరికి సినిమా లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్.
అయితే.. ఇటు బోయపాటి అటు బాలయ్య ఒప్పుకునే వరకు సినిమాని పట్టాలెక్కించకూడదని కూడా నిర్మాత రవీందర్ రెడ్డి డిసైడ్ అయ్యాడని ఫిలింనగర్ గుసగుసలు. బాలయ్య నో అన్న.., బోయపాటి నో అన్నా ఈ సినిమా ఆగిపోయేట్లుగా ఉందని.. ఒకవేళ దర్శకుడు హీరో బాలయ్య కలిసి మరో నిర్మాతని వెతుక్కుని ఈ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఉహాగానాలు టాలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తున్నాయ్. మరి రవీందర్ రెడ్డి ప్రపోజల్‌కి బాలయ్య, బోయపాటి ఓకే అంటారో.. లేదంటే కొత్త నిర్మాతతో సినిమాని ముందుకు తీసుకెళ్తారో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.