Advertisement
Google Ads BL

‘ఊల్లాల ఊల్లాల’ లో సస్పెన్స్ సన్నివేశాలు: గురురాజ్


సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై నటరాజ్ ని హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకి జనవరి 1 న వస్తున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత ఎ.గురురాజ్ విలేకర్లతో చెబుతూ...

Advertisement
CJ Advs

- మీరు నిర్మాతగానే మాకు తెలుసు ఇప్పుడు ఈ చిత్రంలో నటుడిగా చేశారు, దీని వెనక కారణం ?

నటుడిగా చేయడానికే నేను 90’s లో పరిశ్రమకి వచ్చాను కానీ కళామతల్లి మీద ప్రేమతో నిర్మాతగా మారాను. అయితే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చిన్న చిన్న వేషాలు మాత్రమే వేసాను. కానీ ‘ఊల్లాల ఊల్లాల’ లో మాత్రం కథని నడిపించే పాత్రని నేను కచ్చితంగా వేయాల్సి వచ్చింది. అనుకున్నట్టుగానే నా పాత్ర బాగా రావడమే కాక చిత్రానికి బాగా పనికొచ్చింది.

- మీ సినిమా పోస్టర్ ఏంటి గుర్రం అమ్మాయి ఇవన్ని చిత్రంలో నిజంగా ఉన్నాయా లేదా మీరు ఆలా క్రియేట్ చేసారా?

అది సస్పెన్స్ గా తీసుకెళ్తున్నాం, ఆ పోస్టర్ చూస్తేనే సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఆ  పోస్టర్ చూసాక పెరిగిన అంచనాలన్నీ థియేటర్ లో తెరమీద దొరుకుతాయి.

- దర్శకుడు సత్య ప్రకాష్ గారితో మీకు అనుభందం ఎలాంటిది, ఈ సినిమాని ఎలా ఒక షేప్ కి  తీసుకొచ్చారు?

సత్య ప్రకాష్ గారు నాకు రాజేంద్ర  ప్రసాద్ గారు మరియు ఇతర నటులలాగే సినిమాల్లోనే పరిచయం. సినిమా లో ఎంత  క్రూరమైన విలన్ లా కనిపిస్తాడోఆయన బయట అంట పెద్ద భక్తుడు. ఒకరోజు అనుకోకుండా ఒక పాయింట్  చెప్తా  వింటావా అని అన్నారు. అలా అప్పుడు చెప్పిన లైన్ ని  తీసుకొని  స్టోరీ గా డెవలప్ చేసి కొత్త కంటెంట్ తో  ఎంటర్టైనింగ్ గా చూపించాం, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయడం ఖాయం.

- కంటెంట్ నమ్ముకునే సినిమాలు చేసాం అన్నారు అది ప్రూవ్ అవుతూ వచ్చిందనుకుంటున్నారా ?

కొన్ని చిత్రాల ఫలితం అనుకున్నట్టుగా రావు. పెద్ద హీరోలని పెట్టి తీసినా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవు, ప్రేక్షకులు చూడరు. అలాగే మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కథ విన్నప్పటికి తీసి విడుదలయ్యే సమయానికి కథనాల్లో చాలా మార్పులొచ్చేస్తాయి, కానీ ఈసారి అలా జరగకుండా సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని దగ్గరుండి గమనిస్తూ జాగ్రత్తలు వహిస్తూ పూర్తిగా ఇంవోల్వ్ అయ్యి అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసాం.

- ‘ఊల్లాల ఊల్లాల’ స్టోరీ మీరే ఇచ్చారంట కదా?

అవును, సత్యప్రకాష్ గారిచ్చిన లైన్ ని తీసుకుని పూర్తిగా ఇంవోల్వ్ అయ్యి స్టోరీని మేమే రాసాం.

- ఇందాక చాల లొకేషన్స్ చెప్పారు మరి అనుకున్న బడ్జెట్‌లో తీసారా?

కొన్ని కొన్ని చోట్ల బడ్జెట్ తేడాలు వచ్చినా, క్వాలిటీ బాగా వచ్చినందుకు సంతృప్తిగా ఉంది. అనుకున్న సమయం కంటే కొంత ఎక్కువ సమయం పట్టినా, చిత్రం అద్భుతంగా  పూర్తయినందుకు సంతోషంగా ఉంది.

- సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి A సర్టిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి?

కథలో భాగంగా ఉన్న గ్లామర్ కానీ రొమాన్స్ కానీ ఇతర అంశాలకి గాను సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి A సర్టిఫికేషన్ ఇచ్చారు.

- మీరు చాల పేద కుటుంబం నుంచి వచ్చారు నిర్మాతగా లైఫ్ లో ఎదురుకున్న చేదు అనుభవాలు ఏంటి?

మొదట్లో ఉన్న పరిశ్రమకి ఇప్పటికి చాలా మార్పులు, అభివృద్ధులు జరిగాయి అందువల్ల అవకాశాలు కూడా పెరిగాయి. ఎప్పటినుండో పరిశ్రమలో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్నవి జరగలేదు, కష్టాలు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

- రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నారా?

ఆయన గురించి నేను బయట నెగటివ్ గా విన్నదానికి ఆయన నిజంగా ఉన్నదానికి చాలా తేడా ఉంది, చాలా డిగ్నిటీ తో వ్యవహరిస్తారు, చాలా మంచి మనిషి, మాటకి విలువిస్తారు. అలాగే నేను పిలవగానే మొదట్లో తనకి చిత్రానికి సంబంధం లేదు కాబట్టి రాను అన్నారు కానీ మీరొస్తే మా చిత్రానికి ప్లస్ అవుతుంది అనగానే ఈవెంట్ కి వచ్చారు, అన్ని కుదిరితే ఆయనతో ఒక ప్రాజెక్టు చేయడం మాకు చాలా సంతోషం.

- మీరు రియల్ఎస్టేట్ లో ఉన్నారు స్టూడియో ఆలోచన ఏమైనా ఉందా?

ప్రస్తుతానికి లేదు, మాకు సుఖీభవ పేరుతో వేరు వేరు సంస్థలు స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాము, అన్నీ కుదిరితే ఆ వైపు కూడా ఆలోచిస్తాము.

ullala ullala Producer Gururaj Interview:

ullala ullala Producer Gururaj Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs