Advertisement
Google Ads BL

మహేశ్‌తో ఫొటో షూట్..తొక్కిసలాట..కేసు నమోదు


సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు కోట్లాది మంది అభిమానులున్నారన్న విషయం తెలిసిందే. ఆయనతో ఫొటో దిగలాని ఎవరికైనా ఉంటుంది.. అవకాశమొస్తే అభిమానులు క్యూ కడతారు.! అలాంటి అవకాశం రానే వచ్చింది. హైదరాబాద్‌లోని లింగంపల్లి.. ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం నాడు ఫొటో షూట్ జరిగింది. మహేశ్‌తో ఎప్పుడెప్పుడు ఫొటో దిగుదామా అని ఎదురుచూసిన అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫొటో షూట్ స్పాట్ దగ్గరికి చేరుకున్నారు. అయితే అంతా ఓకే ఇక షూట్ రన్నింగ్‌లో ఉందనుకున్న టైంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన అభిమానులు భారీగేడ్లను విరగ్గొట్టారు. ఈ ఘటనలో పలువురు ఫ్యాన్స్‌కు గాయాలయ్యాయి. వారిని తోటి అభిమానులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. మరోవైపు షూట్‌కు తమ అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు చేపట్టిన ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. అయితే.. పోలీసులు తీరుపై, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ వ్యవహారంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండ్రోజుల క్రితం నుంచే.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఆధ్వర్యంలో మహేశ్‌తో ఫొటో షూట్ ఉంటుందని ఆన్‌లైన్‌లో ప్రకటన వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇలా భారీగా రావడంతో తొక్కిసలాట జరగడం.. పోలీసు కేసు నమోదవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇవాళ జరిగిన ఘటనపై మహేశ్ ఇంతవరకూ రియాక్ట్ అవ్వలేదు.. సోషల్ మీడియా వేదికగా ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

News About Super Star Mahesh Babu Photo Shoot:

News About Super Star Mahesh Babu Photo Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs