Advertisement
Google Ads BL

జనవరి 15న ‘ఎంతమంచివాడవురా’..!


సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదలవుతున్న నందమూరి కల్యాణ్‌ రామ్‌ ‘ఎంతమంచివాడవురా’

Advertisement
CJ Advs

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎంతమంచివాడవురా. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌  లిమిటెడ్‌ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌  ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన పాత్రికేయుల  సమావేశంలో ...

నిర్మాత ఉమేష్‌ గుప్తా మాట్లాడుతూ - “‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సతీష్‌ వేగేశ్న సినిమాను  అద్భుతంగా తెరకెక్కించారు. కల్యాణ్‌రామ్‌గారు, మెహరీన్‌ సహా అందరూ చక్కటి సపోర్ట్‌ను అందించారు.  గోపీసుందర్‌గారు సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు  విడుదలయ్యాయి. ఈ రెండు పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. మరో రెండు పాటలను త్వరలోనే విడుదల చేయబోతున్నాం” అన్నారు. 

చిత్ర సమర్పకుడు శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ - “ఓ గుజరాతీ సినిమా చూసి దాన్ని ఉమేష్‌గారికి చూపించాం. ఆయనకి నచ్చింది. తెలుగు ఆడియెన్స్‌ నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేసుకోవచ్చునని భావించాం. అందరికీ నచ్చడంతో సినిమాను స్టార్ట్‌ చేశాం. అద్భుతంగా ఈ సినిమాను ప్రెజంట్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది సంక్రాంతి సినిమా. కల్యాణ్‌రామ్‌గారు నటిస్తోన్న17వ చిత్రమిది. మెహరీన్‌ చక్కగా నటించింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చేంత స్పాన్‌ ఉంది. కాబట్టి ఈ సినిమా ఆ కోవలో అన్ని వర్గాల  ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తుంది. మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నామని చెబుతున్నాం” అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర మాట్లాడుతూ - “ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. మంచి టీం. కుటుంబంలా కలిసిపోయి వర్క్‌ చేశాం. కల్యాణ్‌రామ్‌గారు సినిమా మ్యూజిక్‌ బాగా రావడంలో ఆసక్తిని కనపరిచారు. కృష్ణ ప్రసాద్‌గారు, ఆదిత్య మ్యూజిక్‌ ఉమేష్‌గుప్త గారికి థ్యాంక్స్‌. ప్రస్తుతం బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కంపోజ్‌ చేస్తున్నాను” అన్నారు. 

డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ - “టైటిల్‌ పెట్టగానే .. ఇండస్ట్రీలోని మంచి వ్యక్తుల్లో కల్యాణ్‌రామ్‌గారు ఒకరు. ఆయనకు తగ్గ టైటిల్‌ పెట్టావని చాలా మంది అన్నారు. ఉమేష్‌గుప్త గారు, సుభాష్‌ గుప్త గారు, కృష్ణప్రసాద్‌గారు ఏం అడిగితే దాన్ని సమకూర్చి బెటర్‌గా చేయమని ఎంకరేజ్‌ చేశారు. మ్యూజిక రంగంలో అగ్రగామి అయిన ఆదిత్య మ్యూజిక్‌  తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తొలి సినిమా నాతోనే చేయడం ఆనందంగా అనిపిస్తుంది. హీరో, డైరెక్టర్‌ అని కాకుండా కల్యాణ్‌రామ్‌గారు నాతో బాగా ఇన్‌వాల్వ్‌  అయ్యారు. ఆయన కొత్తగా కనపడతారు. నన్ను నమ్మినందుకు కల్యాణ్‌గారికి థ్యాంక్స్‌. మెహరీన్‌ కూడా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలో చక్కగా నటించింది. గుజరాతీ మూవీ కాన్సెప్ట్‌  ఇది. సినిమా చూశాం. అందులోని మెయిన్‌ పాయింట్‌ను తీసుకుని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలిపి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేశాం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక  సంబంధాలు కావు. ఆర్ధిక సంబంధాలని నమ్మిన వ్యక్తిగా మా హీరో ఇందులో కనపడతారు. సినిమా బాగా వచ్చింది. అందరూ బాగా కో ఆపరేట్‌ చేసి సినిమా చేశారు. అందరూ మనసుకు  నచ్చి సినిమా చేశాం. శతమానం భవతిని ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు. 

హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - “మా సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాం. జనవరి మొదటి వారంలో మరోసారి అందరినీ కలుస్తాం. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌” అన్నారు.

Entha Manchivadavuraa Movie Press Meet Details:

Celebrities Speech at Entha Manchivadavuraa Movie Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs