Advertisement
Google Ads BL

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘జార్జ్ రెడ్డి’


ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ మేరకు డిసెంబర్ 22 మరియు 23వ తారీఖుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నారు.

Advertisement
CJ Advs

George Reddy goes to International Film Festival:

George Reddy Movie Rare feat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs