లావణ్య త్రిపాఠికి ఎక్కడో ఒకటో అరా సినిమాలు మాత్రమే ఉంటున్నాయి. ట్రెడిషనల్ నుండి గ్లామర్ షో కి దిగినా పాపకి అవకాశాలు రావడం లేదు. అర్జున్ సురవరం సినిమా కూడా సో సో టాక్ పడింది. తాజాగా సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తుంది. మరి పట్టుమని పది సినిమాలు కూడా లేని ఈ భామపై తాజాగా జీఎస్టీ అధికారుల ఆకస్మిక దాడి తో టాలీవుడ్ షేకయ్యింది. మొన్నీమధ్యనే నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీస్ పై ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడులను మరవక ముందే.. ఇప్పుడు ఈ లావణ్య పై జరిగిన జీఎస్టీ దాడులతో టాలీవుడ్‌కి ఒణుకుపుడుతుంది.
లావణ్య త్రిపాఠి ఇంట్లోకి ఎలాంటి నోటీసు లేకుండా జీఎస్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. అయితే లావణ్య త్రిపాఠి బిజినెస్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టిందని.. దానికి సంబంధించిన జీఎస్టీ లావణ్య కట్టలేదని, అందుకే ఆకస్మికంగా చెప్పా పెట్టకుండా జీఎస్టీ అధికారులు లావణ్య త్రిపాఠి ఇంటి మీద పడినట్లుగా సమాచారం. మరి లావణ్య ఇంటిలో జీఎస్టీ అధికారులకు ఎంత మొత్తం దొరికింది అనేది సమాచారం లేదు. కాకపోతే జీఎస్టీ అధికారులు వచ్చినప్పుడు లావణ్య షూటింగ్‌లో ఉండడం.. జీఎస్టీ అధికారులు వచ్చారని చెప్పగానే ఆమె షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి హడావిడిగా ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది.