Advertisement
Google Ads BL

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అంటున్న హీరో


జనవరిలో హీరో సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రెగ్యులర్ షూటింగ్

Advertisement
CJ Advs

‘చి.ల.సౌ’తో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు సుశాంత్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ‘అల...వైకుంఠపురములో’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్న ఈ యువ హీరో ఇప్పుడు ఎస్.దర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో నటించనున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ని శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సైన్ బోర్డ్‌తో పాటు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, దానిపై గులాబీ పువ్వు కూడా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేపుతుంది. జనవరి 2020 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

 

నటీనటులు:

సుశాంత్

వెన్నెలకిషోర్

ప్రియదర్శి

అభినవ్ గోమటం

ఐశ్వర్య

నిఖిల్ కైలాస

కృష్ణ చైతన్య తదితరులు

 

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: ఎస్.దర్శన్

నిర్మాణ సంస్థలు:  ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్

నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల

కెమెరా: ఎం.సుకుమార్

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

ఎడిటర్: గ్యారీ బీహెచ్

డైలాగ్స్: సురేష్ భాస్కర్

ఆర్ట్: వీవీ

పి.ఆర్.ఓ: వంశీ శేఖర్

Sushanth’s Next Titled Ichata Vahanamulu Niluparadu, Shoot Starts In January:

<span>Young hero Sushanth who is presently starring in Stylish Star Allu Arjun&rsquo;s Ala Vaikunthapurramloo where he is playing a crucial role has finally signed his next solo hero film.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs