కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ హీరోయిన్ అయినా నిలదొక్కుకుని.. స్టార్ హీరోల సినిమాలే టార్గెట్ గా పని చేస్తుంది. ఇక రకుల్ ప్రీత్ కూడా అదే పని చేసింది. కెరీర్ ఆరంభం నుండి వచ్చిన అవకాశాన్ని వదలకుండా.. చిన్న, యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాలను చుట్టేసింది. ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్న రకుల్ ప్రీత్.. ఇటు యాడ్స్, అటు బిజినెస్ అంటూ తెగ సంపాదిస్తుంది. బాలీవుడ్ పత్రికల కవర్ పేజెస్ కి స్పెషల్ ఫోటో షూట్స్ తో ఇలా ఎప్పుడు బిజీ లైఫ్ ని గడిపే రకుల్... ఇప్పుడొక సత్యాన్ని చెబుతుంది. అదేమిటంటే కెరీర్ తొలినాళ్లలో సాహసాలు అంటే ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడం అంటే కాస్త కష్టం.
కానీ ఇప్పుడు ప్రయోగాలు, సాహసాలు ఏమైనా చెయ్యొచ్చు అంటే.... కథ బాగోకపోయినా.. పాత్రలోని కొత్తదనం కనిపిస్తే సినిమా ఒప్పుకోవచ్చనే ధీమా ఉంటుంది. అదే కెరీర్ తొలినాళ్లలో.. ఇలాంటి ప్రయోగాలకు సక్సెస్ కాకపోతే.. అంటూ కొత్తదనం వైపు అడుగెయ్యలేము అని చెబుతుంది. ఇక ప్రస్తుతం పలు భాషల సినిమాలు చేస్తుంటే.. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలతో పాటుగా ఆహారపు అలవాట్లు తెలుసుకోవచ్చు, ఇక తాను సినిమాల్లోనూ, బయట కూడా ఎప్పుడూ ప్రయోగాలకు సిద్దమే అంటూ.. ఇప్పుడు కొత్తగా ఉండే పాత్రల కోసం వెతుకుతా అంటుంది రకుల్ ప్రీత్.