త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ డిమాండ్ అంతా ఇంతా కాదు. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్ బాగా నచ్చుతాయి. అందులోను త్రివిక్రమ్ కామెడీ పంచ్ లకు ఓవర్సీస్ ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు అక్కడ భారీ డిమాండ్. ఇక అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరు. అల్లు అర్జున్ త్రివిక్రమ్.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్‌తో ఓవర్సీస్‌ని ఓ ఊపు ఊపారు. మరి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టే కసితో దిగబోతున్న అల వైకుంఠపురములో సినిమాకి ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా కనబడుతున్నారు. ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయిన అల వైకుంఠపురములో ఓవర్సీస్ హక్కులు సినిమాపై క్రేజ్‌ని తెలియజేస్తున్నాయి.
మరోపక్క మహేష్ బాబు కూడా ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉన్న హీరో. కాకపోతే స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు ఓవర్సీస్‌లో అంతగా లేకపోవడం, అల వైకుంఠపురములో సినిమా కంటెంట్ కన్నా సరిలేరు నీకెవ్వరు కంటెంట్‌లో కాస్త డిఫ్రెన్స్ కనిపించడంతో మహేష్ సినిమాకన్నా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి ఓవర్సీస్ లో ఎక్కువ క్రేజ్ కనబడుతుంది. ఆ క్రేజ్ తోనే ‘అల..’ కి రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 11న ఫుల్ డే మొత్తం ప్రీమియర్లు పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ తో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉండడంతో.. సరిలేరు నీకెవ్వరు కన్నా ఒక అడుగు ముందే అల వైకుంఠపురములో ఓవర్సీస్ క్రేజ్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరి ఓవర్సీస్ లో మహేష్ సరిలేరు కన్నా ఎక్కువగా అల వైకుంఠపురములో ప్రీమియర్స్ జోరు ఎక్కువగా ఉండబోతుందట.