Advertisement
Google Ads BL

48 కోట్ల డీల్ నిజమేనా దేవరకొండ?


టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలో స్టార్ రేంజ్‌కి చేరిన హీరో విజయ్ దేవరకొండ. రౌడీ బ్రాండ్‌తో భీభత్సమైన పాపులారిటీ సంపాదించిన విజయ్ దేవరకొండ స్టయిల్ కి టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ పరిచింది. బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ని తలదన్నేలా రౌడీ బ్రాండ్ అంటూ విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో పాతుకుపోయేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే కరణ్ జోహార్‌తో స్నేహం, పూరి ‘ఫైటర్’ని పాన్ ఇండియా ఫిల్మ్‌గా మార్చడం, బాలీవుడ్ హీరోయిన్స్ అంతా విజయ్ స్టయిల్ కి పడిపోవడం అమ్మో ఇలా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ వచ్చేసింది.

Advertisement
CJ Advs

అయితే ఇదే క్రేజ్‌తో ఇప్పుడు విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లో ఓ 48 కోట్ల డీల్ సెట్ అయినట్లు, విజయ్ దేవరకొండకి హీరోగా 48 కోట్ల పారితోషకం ఇస్తామని యష్ రాజ్ ఫిలిమ్స్ అడిగినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ బ్రాండ్ అండ్ స్టయిల్ అండ్ యాక్టింగ్ స్కిల్స్‌కి యష్ రాజ్ ఫిలిమ్స్ వారు పడిపోయి.. భారీ డీల్ తో విజయ్ తో మల్టీ లాంగ్వేజ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ఇక విజయ్ దేవరకొండ కూడా కరణ్ జోహార్ సలహాతో ఆ ఆఫర్‌ని కాదనలేకపోయాడనే న్యూస్ నడుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ 48 కోట్ల ఆఫర్ విషయం అంతా ఒత్తి గాసిప్పే అని, విజయ్‌కి యష్ రాజ్ ఫిలిమ్స్ అసలు 48 కోట్ల డీల్ ఆఫర్ చేయలేదని, అదంతా కేవలం ఓ గాసిప్ అంటున్నారు. మరి నిజానిజాలు తెలియాలంటే మాత్రం విజయ్ దేవరకొండ నోరు విప్పాల్సిందే.

Vijay Deverakonda’s 48 Cr Package for YRF Fake:

Vijay Deverakonda’s 48 Cr Package Fake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs