Advertisement
Google Ads BL

3 క్యాపిటల్స్‌పై రైతుల ఆందోళన.. షూటింగ్‌లో ‘పవన్’ బిజీ!?


టాలీవుడ్‌లో ఒకప్పుడు తన ట్రెండ్‌తో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కల్యాణ్.. రీ ఎంట్రీ ఇచ్చేశారా..? ఇన్ని రోజులుగా ‘పింక్’ రీమేక్‌ లేదు.. ఏం లేదు రాజకీయాలే ముద్దని చెప్పుకున్న పవన్.. మూడో కంటికి తెలియకుండా షూటింగ్‌లో పాల్గొన్నారా..? అందుకే కొన్ని కొన్ని విషయాలకు తాను దూరంగా ఉండి.. అన్నయ్య నాగబాబును రంగంలోకి దింపారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే దాదాపు నిజమని తెలుస్తోంది. అసలేం జరుగుతోంది..? పవన్ నిజంగానే షూటింగ్‌లో ఉన్నారా..? అనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

భిన్న స్వరాలు.. నేడు నివేదిక!?

ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి కాదు రెండు కాదు మూడు రాజధానులు ఉండొచ్చని.. అవి ఎక్కడెక్కడ ఉంటాయో కూడా అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మెజార్టీ నేతలు స్వాగతించారు. అంతేకాదు.. ఈ నిర్ణయాన్ని టీడీపీకి చెందిన నేతలు సైతం స్వాగతించారు. మరోవైపు.. వైసీపీ నేతల్లో కూడా కొందరు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. మరోవైపు మీడియా ముందుకొచ్చిన మంత్రులు చిత్రవిచిత్రాలుగా మాట్లాడేస్తున్నారు. అసెంబ్లీలో ఆయన ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నెన్ని మాటలు.. ఎన్నెన్ని భిన్న స్వరాలు వచ్చాయో లెక్కేలేదు. కాగా మూడు రాజధానులపై నేడు కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.. దాన్ని బట్టే అధికారిక ప్రకటన ఉండనుంది.

వారిద్దర్నే ఎందుకు పంపారో!?

ఇక ఇవన్నీ పక్కనెట్టి అసలు విషయానికొస్తే.. జగన్ ప్రకటన అనంతరం ఒకట్రెండు సార్లు ట్విట్టర్ వేదికగా పవన్ స్పందించాడు. ఆ తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఒకప్పుడు రాజధాని గురించి అక్కడుండాలి..? ఇక్కడుండాలి..? అని కర్నూలుకు వెళ్లితే అక్కడే అదే మాట.. విశాఖకు వెళితే ఇక్కడా ఇదే మాట.. ఇలా చెప్పిన పవన్ ఇప్పుడు అసలు విషయం వచ్చే సరికి అస్సలు పట్టించుకోవట్లేదు. అంతేకాదు.. రాజధాని చుట్టు పక్కల ప్రాంత వాసులు, భూములిచ్చిన రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీ చేపట్టినప్పటికీ.. జగన్ ప్రకటనను వ్యతిరేకించే పవన్ మాత్రం అమరావతికి వెళ్లలేదు. మరోవైపు ఆయన వెళ్లకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు, పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్‌ను అక్కడికి పంపారు. వాస్తవానికి ఇది చాలా సీరియస్ విషయం.. పవన్ వ్యతిరేకిస్తున్నాడు గనుక ఆయనెళితే పరిస్థితులు వేరు..? పార్టీకి చెందిన నేతలు వెళ్లడం వేరు కదా..!

అటు ఆందోళన.. ఇటు షూటింగ్!

అయితే.. ఇంతగా వ్యతిరేకించే పవన్ ఎందుకు వెళ్లట్లేదు..? ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు జనసేనాని దూరంగా ఉన్నారు..? అనే విషయాలపై కాస్త లోతుగా పరిశీలించగా.. పింక్‌ రీమేక్‌లో పవన్ బిజిబిజీగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఇంత హడావుడి జరుగుతున్నప్పటికీ పవన్ కనీసం మీడియా ముందుకు గానీ.. అమరావతికి వెళ్లి ఆందోళనలో కానీ పాల్గొనలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సినిమాకు సంబంధించి లుక్స్ గట్రా బయటికొస్తే బాగోదని భావించిన పవన్ ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కాగా.. ఇటీవలే పవన్ కాకినాడ రైతులకు సంబంధించి ధర్నా చేస్తున్నప్పుడు ‘పింక్’ రీమేక్‌కు కొబ్బరికాయ కొట్టేశారు. అప్పుడు పవన్ అక్కడుండగా.. ఇప్పుడు అమరావతిలో హడావుడి జరుగుతుంటే ఈయన షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారట.

ఎన్ని సార్లు ఇలా..!?

మరీ ముఖ్యంగా.. పవన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనాని ఎప్పుడు చూసినా ఇలానే చేస్తుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో.. టీడీపీ అవినీతిని ఎండగడతానని.. ఆ తర్వాత వైజాగ్ బీచ్‌లో క్యాండిల్ ర్యాలీకి వస్తానని రాకపోవడం ఇవన్నీ గుర్తు చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అవుతూ.. తప్పుబట్టిన తర్వాతే పవన్ మాట్లాడారని ఇలా అస్తమానూ యూటర్న్‌లు తీసుకుంటూ సొంత అభిమానులు, మెగాభిమానులు, జనసేన కార్యకర్తలను మోసం చేస్తున్నారని పలువురు విమర్శలు ఎద్దేవా చేస్తున్నారు.

రియాక్ట్ అవుతారా!?

ఇప్పటికే ఆయన 20 రోజుల పాటు షూటింగ్‌కు కేటాయించారని వార్తలు గుప్పుమన్నాయ్. తాజా వ్యవహారంతో ఇదే నిజమని అనిపిస్తోంది. ఫైనల్‌గా పవన్ ఎక్కడున్నాడు..? నిజంగానే షూటింగ్‌లోనే బిజీబిజీగా ఉన్నాడా..? లేకపోతే ఇంకేమైనా పనిమీద ఉండి అమరావతికి వెళ్లలేకపోయారా..? అనేది తెలియాలంటే..? జనసేన కార్యకర్తల అనుమానాలు పటాపంచ్‌లు అవ్వాలంటే పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేదా.. పవన్ మీడియా మైకుల ముందుకు రావాల్సిందే మరి.

Where is Pawan Kalyan?:

AP in Critical Condition.. Pawan Kalyan busy with shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs