Advertisement
Google Ads BL

నాకోసమే పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంది: కట్టప్ప


‘దొంగ‌’ చిత్రంలో నా పాత్ర డిఫ‌రెంట్ గా ఉంటుంది - న‌టుడు స‌త్య‌రాజ్‌

Advertisement
CJ Advs

హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న స‌త్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘దొంగ‌’. యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై రూపొందుతున్నఈ చిత్రంలో నటి జ్యోతిక, స‌త్య‌రాజ్  కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా స‌త్యరాజ్ ఇంట‌ర్వ్యూ..  

మీ కోసం ద‌ర్శ‌కులు కొత్త పాత్ర‌ల‌ను క్రియేట్ చేయ‌డం ఎలా ఉంది?

- ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 230 పైగా సినిమాల్లో నటించాను. 100 సినిమాల్లో హీరోగా, 75 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాను. వివిద ర‌కాల‌ పాత్రలు పోషించాను. అయితే  ఏ పాత్రకు ఆపాత్ర భిన్నంగా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా నాతో పని చేసిన దర్శకులకే చెందుతుంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ తరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు.  ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే ఓ న‌టుడికి  కావల్సింది ఏముంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి.

దగ్గరకు వచ్చి సెల్ఫీ, ఆటోగ్రాఫ్స్ అని అడుగుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుందా?

-  అలా ఏం లేదండి! ఎందుకంటే నా దృష్టిలో యాక్టర్ అనే వాడు సెల్ఫీ, ఆటోగ్రాఫ్స్ కి ఇరిటేట్ అవ్వకూడదు. ఎందుకంటే మనకిచ్చే పేమెంట్ అనేది వాటికి కూడా కలిపే( నవ్వుతూ)

మీరు న‌టించిన సినిమాలు నేను నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు క‌దా?

 - ‘పసివాడిప్రాణం’, ‘ఆరాధన’, ‘అసెంబ్లీరౌడీ’, ‘ఎస్.పి.పరశురాం’, యం ద‌ర్మ‌రాజు యంఎ. ‘బ్రహ్మ’ ఇలా చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ చేశారు. అన్ని సూప‌ర్‌హిట్ సాధించాయి.

‘దొంగ‌’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

- ‘దొంగ‌’  సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో నా పాత్ర ద్వారా  మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. అది చాలా కొత్త పాయింట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడేలా ఉంటాయి.

కార్తీతో క‌లిసి రెండోసారి వ‌ర్క్ చేయ‌డం ఏలా అనిపిస్తోంది?

- కార్తీతో ‘చినబాబు’ సినిమా చేశాను. తరువాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కార్తీ, జ్యోతిక ఇద్దరు బాగా చేశారు. జీతూ జోసెఫ్ ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అనవసరమైన సీన్లు తీయకుండా తనకి ఏం కావాలో అదే తీస్తాడు. చాలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్.  

ఒకే వారంలో రెండు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయిగా?

- నిజ‌మే!.. తెలుగు, త‌మిళంలో రూపొందిన ‘దొంగ‌’, తెలుగులో న‌టించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. రెండు పాత్రలు దేనిక‌దే భిన్నంగా ఉంటాయి. ఆర్టిస్టుగా అదో సంతృప్తి. 

Sathyaraj Interview about Donga Movie:

Actor Sathyaraj Talks about Donga Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs