Advertisement
Google Ads BL

2020లో అయినా వీరికి పెళ్లి అవుతుందా?


మోస్టర్ వాంటెడ్ అన్ మారీడ్ లిస్ట్ లో ప్రభాస్, రానా, నితిన్, శర్వానంద్, నిఖిల్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలున్నారు. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటాడా? అని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో ప్రభాస్ పెళ్లి అంటూ పుకార్లు రావడమే కానీ... ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యింది లేదు. అనుష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు రావడమే కానీ.. ప్రభాస్ కానీ, అనుష్క కానీ స్పందించింది లేదు. ఇక దగ్గుబాటి వారసుడు హీరో రానా అంతే. హీరోయిన్స్ తో ఎఫ్ఫైర్స్ అంటూ రానా మీద వచ్చినన్ని రూమర్స్ మరే ఇతర హీరో మీద రాలేదు. అయినా రానా పెళ్లి చేసుకోడు. కాకపోతే ఈ ఏడాది అంతా అనారోగ్య కారణాలతో రానా కాస్త సఫర్ అయ్యాడు.

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్, రానా తర్వాత నితిన్ కూడా పెళ్లి మాట ఎత్తకుండా ఇప్పటివరకు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే గత వారంరోజుల నుండి మీడియాలో నితిన్ పెళ్లి ముచ్చట్లు వినబడుతున్నాయి. తాను ప్రేమించి పెళ్లాడబోతున్నట్లుగా అది 2020 లో తన పెళ్లి అని నితిన్ చెప్పినట్లుగా న్యూస్. ఇక శర్వానంద్ కూడా పెళ్లి వయసు దాటిపోయిన హీరోనే. కాకపోతే సినిమాల మీద సినిమాలు చేస్తూ శర్వానంద్ పెళ్లి ఊసెత్తడం లేదు. ఇక విజయ్ దేవరకొండ, నిఖిల్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నాగశౌర్యలు కూడా పెళ్లి పేరెత్తకుండా తమ పని తాము సైలెంట్ గా చేసుకుపోతున్న హీరోలే. మరి 2019 లో అలా వచ్చి ఇలా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి 2020 లో అయినా ఈ హీరోల్లో ఎంతమంది పెళ్లిపీటలెక్కుతారేమో చూడాలి. 

Most Eligible Bachelors Of Telugu Film Industry:

Tollywood Heroes list for Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs