Advertisement
Google Ads BL

పవన్ స్థానం భర్తీ చేస్తున్న ఎన్టీఆర్?


టాలీవుడ్‌లో దర్శకులతో హీరోలు కలిసి ఫ్రెండ్ షిప్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్ బడా హీరో పవన్ కళ్యాణ్, టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ స్నేహం మాత్రం చాలా స్పెషల్. త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేసినా.. సినిమాలనే కాదు. ఏ విషయంలో అయినా త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ చాలా స్నేహంగా ఉండేవాడు. పవన్ ఎక్కడుంటే త్రివిక్రమ్ అక్కడే ఉండేవాడు. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్ళాక కూడా త్రివిక్రమ్ చాలావరకు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసాడు. కానీ తర్వాత పవన్ సినిమాలు వదిలెయ్యడం, త్రివిక్రమ్ వేరే హీరోలతో బిజీ అవడంతో.. వారి మధ్యన కాస్త గీతలాంటి స్పేస్ ఏర్పడింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కి పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్ చేరాడని విషయం టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న న్యూస్. త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తీసిన దగ్గరనుండి వీరిమధ్యన స్నేహం బలపడిందని, త్రివిక్రమ్ కి పవన్ తర్వాత ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడని, ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో స్నేహం చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతోనూ, త్రివిక్రమ్ బన్నీ సినిమాతోనూ బిజీగా వున్నారు. త్రివిక్రమ్ తెలివితేటలకు, ఆయన మేథా శక్తికి, త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్ గా మారిపోయాడని, అందుకే RRR తరవాత త్రివిక్రమ్ తోనే ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ వినబడుతుంది. 

Young Tiger NTR Replaces Pawan Kalyan:

Trivikram One More Movie with Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs