Advertisement
Google Ads BL

బాలయ్యకు హీరోయిన్‌ని సెట్ చేసిన బోయపాటి!


బోయపాటి - బాలకృష్ణ సినిమా ఉంటుందని అధికారికముగా అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ... ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. జనవరి నుండి పట్టాలెక్కబోయే బోయపాటి - బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి.. హీరోయిన్ తో పాటుగా మిగతా నటుల ఎంపిక చేపట్టాడు. అయితే బోయపాటికి లక్కీ హీరోయిన్ అయిన కేథరిన్ థెరిస్సాని బాలయ్య హీరోయిన్ గా బోయపాటి ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. సరైనోడు, జయజానకి నాయక సినిమాల్లో నటించిన కేథరిన్ ని తాజాగా బాలయ్య సినిమా కోసం బోయపాటి దింపుతున్నాడనే టాక్ నడుస్తుంది. తమిళనాట ఒకటో అర సినిమాలు చేసుకుంటున్న కేథరిన్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో గుంపులో గోవిందంలా వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా బాలయ్య సినిమా చేస్తున్నందుకు కేథరిన్ భారీ పారితోషకమే అందుకుంటుందనే టాక్ నడుస్తుంది. అసలే హీరోయిన్స్ లేక ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ కోసం కేథరిన్ డిమాండ్ చేసింది ఇస్తున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. బోయపాటి సజెస్ట్ చెయ్యడం, బాలయ్యకి హీరోయిన్స్ కొరత వెరసి కేథరిన్ అడిగింది ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. ఇప్పటికే బాలయ్యకి పది, బోయపాటికి 15 కోట్లు అంటూ ఓ న్యూస్ ఫిలింనగర్ లో బయలు దేరింది. ఇక సినిమాకి 70 కోట్ల పెట్టుబడి.. తాజాగా కేథరిన్ కి కోటి డిమాండ్ చెయ్యగా... చివరికి 80 లక్షల దగ్గర బేరం తెగ్గొట్టినట్లుగా తెలుస్తుంది. మరి అవకాశాలు జోరు లేకపోయినా... కేథరిన్ అలా 80 లక్షలు పట్టుకుపోతుంది. మరి ఇదంతా బోయపాటి చలవే.

Balayya and Boyapati Movie Heroine Fixed:

Catherine Tresa for Balayya 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs