‘వెంకీమామ’ సినిమాను ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేశాం..విక్టరీ వెంకటేశ్‌కి, నాగచైతన్యకి అభినందనలు - మెగాస్టార్ చిరంజీవి
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీమామ’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు.
షో అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి ‘వెంకీమామ’ సినిమా చూశాం. అందరికీ బాగా నచ్చింది. అందరూ ఎంజాయ్ చేశాం. సినిమా అంత బాగా నచ్చడానికి కారణం మిత్రుడు వెంకటేశ్. తన స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోషన్స్‌తో అందరినీ మెప్పిస్తున్నారు. చాలా కాలం తర్వాత యాక్షన్ సన్నివేశాల్లోనూ వావ్ అనిపించాడు. అద్భుతంగా నటించి ఈ సక్సెస్‌కు ప్రధాన కారణంగా నిలిచాడు. తనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఈ సక్సెస్‌లో తను కూడా భాగస్వామిగా మారాడు. డైరెక్టర్ బాబీ తన స్టైల్ ఆఫ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పట్టు సడలకుండా బ్యూటీఫుల్‌గా సినిమాను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో చిత్రయూనిట్‌కు నా అభినందనలు’’ అన్నారు.