Advertisement
Google Ads BL

‘పింక్’ రీమేక్‌: పవన్ అలా వాడుకుంటున్నాడా?


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బాగా హైలెట్ అవుతున్నాడు. ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టే ఇంగ్లీష్ మీద, ఇసుక కొరత మీద తాజాగా రాజధాని మీద ఫైట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినా పింక్ రీమేక్‌తో పవన్ కళ్యాణ్, దిల్ రాజుకి సినిమా చేస్తున్నాడు. పవన్ క్రేజ్‌తో భారీ లాభాలొస్తాయని ఆశపడుతున్న దిల్ రాజు.. పవన్ కళ్యాణ్‌కి భారీగా పారితోషకం సమర్పించుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
CJ Advs

వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగినట్లుగా పింక్ సినిమా స్క్రిప్ట్‌ని మార్పులు చేర్పులతో లాక్ చేసుకున్నాడట. అయితే పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌ని హైలెట్ చెయ్యడంతో పాటుగా ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫైటింగ్‌ని కూడా ప్రేక్షకులు మెచ్చేలా రాసుకున్నాడని, లాయర్ పాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ నుండి పొలిటికల్ సెటైర్స్ ఓ రేంజ్ లో పేలబోతున్నాయనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతున్నాయి. ఏపీలో ప్రస్తుత గవర్నమెంట్‌ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పేల్చబోయే సెటైర్స్, పంచ్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించడం ఖాయమనే టాక్ మొదలైంది. మరి ఇదంతా నిజమైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం పింక్ రీమేక్‌ని వాడుకోబోతున్నాడనిపిస్తుంది. 

Pawan Kalyan Ready for Pink Remake:

Can Pawan Kalyan Nail It To Perfection?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs