Advertisement
Google Ads BL

జడ్జ్ విషయంలో సతమతమవుతున్న రోజా!


నాగబాబు వెళ్ళిపోయినా.. జబర్దస్త్‌ని రోజా సూపర్‌గా హ్యాండిల్ చేస్తుంది అండి, ఇక రోజా ఆధ్వర్యంలో జబర్దస్త్‌కి నాగబాబు ఉన్నపుడు ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందో ఇప్పుడు కూడా ఆ రేంజ్ రేటింగ్ జబర్దస్త్ కి వస్తుందని, సో నాగబాబు వెళ్ళిపోయినా జబర్దస్త్ కి నష్టం లేదన్నారు. అయితే ఇప్పుడు రోజాతో పాటుగా జడ్జ్ సీట్‌లో కూర్చునే రెండో జడ్జ్ పై రోజుకో న్యూస్ వినబడుతుంది. జబర్దస్త్ కి ఏ యంగ్ హీరోనో వచ్చి తన సినిమా ప్రమోషన్స్ తో పాటుగా  కాస్త ఎంటర్టైన్ చేస్తుంటే.... ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రం ఒక వారం సోలోగా, రెండు వారాలు అలీతో పాటుగా కూర్చున్న రోజా.. ఇప్పుడు మళ్ళీ అలీ వెళ్లిపోవడంతో.. తన పక్కన కూర్చొబోయే జడ్జ్ విషయంలో మదనపడుతుందట. ఇక ఈ వారం రోజా పక్కన అనసూయ జడ్జ్‌గా కూర్చోబోతుందట.

Advertisement
CJ Advs

అనసూయ యాంకర్ కం జడ్జ్‌గా ఈ వారం అయితే కూర్చుంటుంది. కానీ తర్వాత ఎవరు అనే దానిపై ఇంకా మల్లెమాల నుండి సస్పెన్స్ వీడడం లేదు. మరోపక్క పోసాని కృష్ణ మురళి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ జడ్జ్‌గా కాదు.. స్కిట్స్ లో కమెడియన్స్ కి సపోర్ట్ గా పోసాని కూడా టీం లో హడావిడి చేస్తున్నాడు. మరి రెండో పర్మినెంట్ జడ్జ్‌ని తెచ్చేలోపల అన్ని విషయాలను రోజా చూసుకోవడం కష్టమంటున్నారు. ఇక జబర్దస్త్ బాధ్యతంతా నెత్తిన పడడంతో.. ఇప్పుడు రోజా అటు రాజకీయాలతోను ఇటు జబర్దస్త్ బాధ్యతలతోనూ సతమతవుతుందట. 

Roja Busy with Jabardasth and Politics:

Roja Waiting for Her Jabardasth Co-Judge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs