మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌తో బాగా బిజీగా వున్నాడనుకుంటే... వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన వెంకీమామ సినిమాని వీక్షించడం.. ఆ సినిమా సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరిపోయిందని.. వెంకీమామ కామెడీ ఎంటెర్టైనర్ అంటూ, ఫ్యామిలీకి వెంకీమామ నచ్చుతుంది అంటూ మహేష్ వెంకీమామ మీద ప్రశంశల వర్షం కురిపించాడు. ఇక వెంకీమామ టీం కూడా మహేష్ కి కృతఙ్ఞతలు తెలుపుకుంది. అయితే ఇప్పుడు మహేష్ వెంకీమామ సినిమాని ఎందుకు చూశాడో తెలుసా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
మహేష్ సరిలేరు తో బిజీగా ఉన్న టైం లో ప్రత్యేకించి వెంకీమామని చూడడానికి కారణం, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఆర్మీ కేరెక్టర్ చేస్తున్నాడు. అయితే నాగ చైతన్య కూడా వెంకీమామ సినిమాలో మిలటరీ పాత్రలో కాసేపు కనిపించాడు. అయితే వెంకీమామ సినిమా విడుదలకు ముందు నుండి నాగ చైతన్య - మహేష్ ల మిలటరీ లుక్స్ మీద బోలెడన్ని న్యూస్‌లు రావడం, వెంకీమామ విడుదల తర్వాత చైతు మిలటరీ ఎపిసోడ్ పెద్దగా లేకపోవడంతో.. మహేష్ బాబు కూడా చైతు అసలు మిలటరీ కేరెక్టర్ లో ఎలా నటించాడు, తన కేరెక్టర్ కి చైతు కేరెక్టర్ కి ఏమైనా పోలికలు ఉన్నాయా అని చూసుకోవడానికి, ఒకవేళ పోలికలేమన్నా ఉంటే... సరిలేరు చిత్రీకరణ పూర్తవలేదు కాబట్టి.. చిన్న చిన్న మార్పులేమైనా చేసుకుందామనే ఉద్దేశ్యంతో..మహేష్ వెంకిమామ సినిమాని ప్రత్యేకంగా చూసాడంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.