Advertisement
Google Ads BL

ఫుల్ స్వింగ్‌లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్


సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు కోసం ఫుల్ స్వింగ్ లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి విడుదలైన పాటలన్నీ శ్రోతల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇటీవలే రొమాంటిక్ మెలోడీగా విడుదలైన మూడో పాట ‘హీ ఈజ్ సో క్యూట్’ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. సూపర్ స్టార్ అభిమానులు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకి ఫిదా అయ్యారు. ఈ చిత్ర ప్రారంభ సమయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరించేలా సంగీతాన్ని అందిస్తానని చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటూ సరిలేరు నీకెవ్వరు కోసం ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బెస్ట్ ట్యూన్స్ ను కంపోజ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇక రాబోయే సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్న ఫోర్త్ సింగిల్ గురించి దేవి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

సరిలేరు నీకెవ్వరు మ్యూజికల్ ఫెస్టివల్ మొదలయినప్పటి నుండి ప్రతి సోమవారం ఒక సూపర్ హిట్ సాంగ్ తో MaSSMB మండేస్, సూపర్ హిట్ మండేస్ గా మారిపోయి ప్రేక్షకులు, అభిమానులు ప్రతి సోమవారం రాబోయే కొత్త పాట కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఈ పాటలకి సంబంధించి కొన్ని వేల టిక్ టాక్ వీడియోలు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని రివీల్ చేశారు. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి ఫీస్ట్ గా జనవరి 11, 2020 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది.

Devi Sri Prasad in Full Swing for Sarileru Neekevvaru:

<span>Devi even stepped out with an interesting update about the fourth single that will be unveiled next Monday</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs