Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, మహేశ్‌, ప్రభాస్‌తో ఒకే డైరెక్టర్!


‘కేజీఎఫ్’ డైరక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ సినిమాతో టాప్ డైరెక్టర్ రాజమౌళికి, ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో..  ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రశాంత్‌కు.. యష్‌కు ఆ రేంజ్‌లో పేరొచ్చింది. అంతేకాదండోయ్.. త్వరలోనే ‘కేజీఎఫ్ చాప్టర్-2’తో మళ్లీ మనముందుకు వచ్చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్‌లోకి దూకాలని ప్రశాంత్ యోచిస్తున్నాడు. వాస్తవానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ టాలీవుడ్‌లోకి దూకేసేవాడే కానీ.. మధ్యలో చిన్నపాటి అడ్డంకులు వచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే.. ఆయన టాలీవుడ్‌కు ఎప్పుడెప్పుడు వస్తాడా..? అని ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుటికే ఈ ముగ్గురు హీరోలకు.. ప్రశాంత్‌కు చర్చలు కూడా జరిగిపోయాయట. ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదండోయ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు వీళ్లే ఆ హీరోలు. ఈ ముగ్గురు హీరోలు ‘కేజీఎఫ్’ సినిమా చూసినప్పట్నుంచి ఆయనతో ఒక్క సినిమా అయినా తీయాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యారట. 

ఈ క్రమంలో వీరందరి కంటే ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కించాలని ఇప్పటికే స్టోరీ లైన్ కూడా చెప్పారని కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయ్. ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండటం.. ఇప్పుడు ఏకంగా భారీ బడ్జెట్ మూవీ RRRలో నటిస్తుండటంతో అది వీలు కాలేదు. అందుకే జూనియర్‌తో సినిమా రద్దయ్యింది. అందుకే ప్రభాస్, మహేశ్‌ కంటే ముందుగా ఎన్టీఆర్ తెరకకెక్కించాలని ప్రశాంత్ అనుకుంటున్నారట. ఆ తర్వాత మహేశ్‌తో ఫైనల్‌గా భారీ చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కించాలని ప్రశాంత్ భావిస్తున్నారట.

ఎన్టీఆర్‌తో సినిమా అయితే మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉందట. మరి ప్రశాంత్ భారీ చిత్రాలకు ఏ నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయో..? అసలు ముగ్గురితో సినిమా ఏ మాత్రం వర్కవుట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. మరి ఈ పుకార్లపై ఆ ముగ్గురు హీరోలు, ప్రశాంత్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

News About JR Ntr, Mahesh, Prabhas Movies...:

News About JR Ntr, Mahesh, Prabhas Movies..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs