Advertisement
Google Ads BL

అటు, ఇటు.. హరితేజ హైలెట్ అవుతోంది


తెలుగులో బిగ్ బాస్ వన్‌లో ఎవరూ పెద్దగా హైలెట్ అవ్వకపోయినా... బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ హరితేజ మాత్రం ఫుల్ ఫామ్‌లో కొచ్చేసింది. ‘అఆ’ సినిమాలో అదిరిపోయే రోల్ ప్లే చేసిన హరితేజ బిగ్ బాస్‌కి వెళ్లొచ్చాక కెరీర్‌లో దూసుకుపోతుంది. ఆ తర్వాత సినిమాలే కాదు యాంకరింగ్‌లోను హరితేజ కొత్తగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక సినిమాల్తో, బుల్లితెర షోస్‌తో ఇరగదీస్తున్న హరితేజ ఇప్పుడు రెండు బడా సినిమాల్లో మంచి రోల్స్ పోషించింది.

Advertisement
CJ Advs

రేపు శుక్రవారం విడుదలకాబోతున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో హరితేజ ఓ మంచి రోల్ పోషించడంతో పాటు ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటుంది. తాజాగా ప్రతిరోజూ పండగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరితేజ మెరుపులు మాములుగా లేవు. ఇక రెండో బడా స్టార్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’లో అయితే రష్మికతో కలిసి ఓ పాటేసుకుంది. మహేష్‌ని రష్మిక టీజ్ చేసే హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లో రష్మిక తో కలిసి డాన్స్ స్టెప్స్ కూడా వేసింది హరితేజ. దీనినిబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’లో హరితేజ రష్మిక పక్కన ఉండబోయే ఫ్రెండ్ లేదా రిలేటివ్ పాత్రో చేసుంటుంది అంటే సినిమాలో హరితేజ చాలావరకు కనిపిస్తూ సందడి చేస్తుందన్నమాట. సో బిగ్ బాస్ వల్లనో.. ఏమో హరితేజ మాత్రం కెరీర్‌లో బాగా బిజీగా మారింది.

Hariteja Highlight with Prathi Roju Pandage and Sarileru Neekevvaru:

Hariteja Important role in Prathi Roju Pandage and Sarileru Neekevvaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs