Advertisement
Google Ads BL

‘సరిలేరు..’ వీడియోస్ లీక్.. మహేశ్ ఆగ్రహం!


టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన సినిమా యూనిట్ రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ విషయంలోనూ దూసుకెళ్తోంది. అయితే అంతే రీతిలో దర్శకనిర్మాతలను ఓ భయం పట్టిపీడిస్తోంది. అదే లీక్స్ వ్యవహారం.!. ఇంతవరకూ షూటింగ్ స్పాట్స్ నుంచి చిన్నపాటి లీక్స్ రాకుండా మేనేజ్ చేసుకున్న యూనిట్.. ఈ మధ్య ఎందుకో చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

రెండ్రోజుల క్రితం మహేశ్‌ బాబు డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో మహేశ్ మాస్ లుక్‌లో లుంగీ క‌ట్టుకున్నాడు. అయితే ఈ వీడియో కావాలనే లీక్ చేశారో..? ఎవరైనా పనిగట్టుకుని మరీ లీక్ చేశారో తెలియట్లేదు గానీ నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. ఈ విషయం మహేశ్ దృష్టికి వెళ్లగా.. ఏంటిది..? అసలెవరు ఇలా లీక్స్ చేస్తున్నది..? అని దర్శకనిర్మాతలు, మూవీ యూనిట్‌పై మహేశ్ కోపగించుకున్నాడని టాక్ నడుస్తోంది. లీకయ్యిందో అయ్యింది.. ఇక ఆ సీన్ తీసేయడం.. ఇకపై ఇలాంటివి లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తోటి నటీనటులకు సూపర్‌స్టార్ సూచించారట. కాగా..‘మైండ్ బ్లాక్..’ అనే సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ కాగా.. ఇందులో మ‌హేష్ లుంగీతో డ్యాన్స్ చేసిన విషయం విదితమే. అయితే ఈ వీడియో లీక్స్ ఈ చీవాట్లతో ఆగుతాయా..? లేకుంటే మరింత పెరుగుతాయా అనేది తెలియాల్సిందే మరి.

Mahesh Babu Serious Over Sarileru Videos Leaked!:

Mahesh Babu Serious Over Sarileru Videos Leaked!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs