Advertisement
Google Ads BL

పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే...!!


రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇక సినిమాల జోలికి వెళ్లనని ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనని స్వయంగా ప్రకటించాడు.. అంతేకాదు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పాడు. అయితే ఆయన మళ్లీ కచ్చితంగా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని.. అది కూడా ‘పింక్’ మూవీతోనే అని గట్టిగా టాక్ నడిచింది. ఒకానొక సందర్భంలో పింక్ రీమేక్ చేస్తున్నది కరెక్టేనని సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు.! దాదాపుగా పవన్‌నే ఫిక్స్ అయిపోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల కొబ్బరికాయ కొట్టేయడం..  పవన్ లేకుండా అన్ని పనులు షురూ చేసేయడం.. అంతేకాదు కేవలం 20 రోజులు మాత్రమే పవన్ షెడ్యూల్స్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇక ఇవన్నీ పక్కనెడితే.. తాజాగా ఓ షాకింగ్ విషయం షికారు చేస్తోంది.

Advertisement
CJ Advs

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌లో పక్కాగా నటిస్తున్నారని ఇప్పటి వరకూ సినిమాలకు రూ. 30 కోట్లు తీసుకున్న పవన్.. రీఎంట్రీతో వస్తున్న ఈ సినిమాకు ఏకంగా 20 పెంచి.. మొత్తం రూ. 50 కోట్లు రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అంటే ఈయన రెమ్యునరేఫనే ఇంతంటే.. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పట్నుంచి రిలీజ్ వరకు ఎంతవుతుందో ఏంటో.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇక ఈ సినిమాకు దిల్ రాజు ఎంత బడ్జెట్ పెడుతున్నారనేది కూడా అర్థం కానిపరిస్థితి. వాస్తవానికి పవన్ ఒప్పుకోనప్పటికీ ఆయన ప్రాణ స్నేహితుడుగా భావించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో రాయబారం నడిపి ఫైనల్‌గా పవన్‌ను దిల్ రాజు ఒప్పించారట.

మరి ఈ సినిమాలో పవన్ సరసన ఎవర్ని తీసుకుంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఇదుగో.. అదుగో ఫలానా హీరోయిన్ అంటూ మాత్రం జూనియర్ హీరోయిన్స్ మొదలుకుని సీనియర్స్ వరకూ పెద్ద ఎత్తునే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా అంజలీ, నివేథా, ఇలియానా, సమంతతో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? రీమేక్ పవన్ ఏమంటారో..? రెమ్యునరేషన్‌పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Shocking Remunaration For Pawan Pink Remake Movie!:

Shocking Remunaration For Pawan Pink Remake Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs