మెగాబ్రదర్ నాగబాబు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే తప్పుకోవడంపై ఇప్పటికే పలు రకాలుగా వార్తలు వినవచ్చాయి. మరీ ముఖ్యంగా బాండ్ పిరియడ్ విషయంలో తేడా కొట్టిందని కొందరు అంటుంటే.. రెమ్యునరేషన్ విషయంలో యాజమాన్యానికి నాగబాబుకు గొడవ జరిగిందని కూడా పుకార్లు వచ్చాయి. అయితే రోజురోజుకు పుకార్లు మరిన్ని పుడుతుండటంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై తన యూ ట్యూబ్ చానెల్.. ‘మై చానెల్ నా ఇష్టం’ వేదికగా రియాక్ట్ అయ్యారు కానీ.. అసలు విషయం చెప్పకుండా ఇప్పటికీ నాన్చుతూనే ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మరో హాట్ హాట్ న్యూస్ వెలుగుచూసింది.
వాస్తవానికి.. ఒకానొక సందర్భంలో స్వయంగా నాగబాబే మాట్లాడుతూ.. ‘మల్లెమాల’ ప్రొడక్షన్స్‌లో ఇచ్చే రెమ్యునరేషన్ తన స్థాయికి తగినది కాదన్న విషయం విదితమే. అయితే ఆ విషయమే అక్షరాలా నిజమని.. పారితోషికం విషయంలోనే తేడా కొట్టి మానేశారని తాజాగా ఓ విషయం వెలుగుచూసింది. ‘జబర్దస్త్’ షోకి జడ్జ్‌గా నాగబాబుకు కేవలం రూ. 15 లక్షలు అందుకున్నారని టాక్. అయితే జీ తెలుగువారు కొత్తగా షో ప్రారంభించడం.. మల్లెమాల కంటే డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జబర్దస్త్ షోకు టాటా చెప్పేసి జీ తెలుగు షోలోకి దూకేశారట. అంటే.. నెలకు రూ. 30 లక్షలు నాగబాబుకు ఇప్పుడు ముట్టుతున్నాయన్న మాట. రెమ్యునరేషన్ డబుల్ ఇస్తామంటే ఎవరు మాత్రం జంప్ కాకుండా ఉంటార్లెండి..!. మరి ఇందులో ఏ మాత్రం నిజముందో నాగబాబే క్లారిటీ ఇవ్వాలి.