Advertisement
Google Ads BL

‘ప్రతిరోజూ పండగే’ అందరికి నచ్చే సినిమా: తేజ్


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యాన్స్ అందరికి నమస్కారం. మారుతి డిజైన్ చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐడియా బాగుంది. సందేశాన్ని ఆహ్లాదకరంగా చెప్పే ట్యాలెంట్ ఉన్న వ్యక్తి మారుతి, అలాగే థియేటర్ లో ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ మారుతి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా చిత్ర యూనిట్ అందరూ నమ్మకంగా ఉన్నాం. సాయి తేజ్ ఈ సినిమాలో చక్కగా నటించాడు. ఈ సినిమాలో నటించిన అందరూ నటీనటులు బాగా చేశారు. యు.వి.వంశీ నేను కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. బన్నీ వాసు ఈ సినిమాను కష్టపడి నిర్మించాడు. నరేష్, రావు రమేష్ పాత్రలు అలరిస్తాయని తెలిపారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘మా ఫంక్షన్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ ఉంటే మాకు ప్రతిరోజు పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యాన్స్, వారందరు గర్వపడాలి నేను సినిమాలో సిక్స్ ప్యాక్ చేశాను. మారుతి గారు నాకోసం అదిరిపోయే స్క్రిప్ట్ చేశారు. సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో పాటు అభిమానుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్న. తమన్ నాకోసం మంచి సాంగ్స్ ఇచ్చాడు. సినిమా చూశాక ఆడియన్స్ నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది. ఐదేళ్ల క్రింద పిల్లా నువ్వులేని జీవితం విడుదలయ్యింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. సినిమా తప్పకుండా మీకు నచ్చుతుందని భవిస్తూ సెలవు తీసుకుంటున్నా’ అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు. నాకు ఒక టెంపుల్‌లో వచ్చిన ఐడియాని దిల్ రాజు గారికి చెప్పాను. రాజు గారికి బాగా నచ్చింది.. ఆ తర్వాత యూవీ వంశీకి, తేజ్‌కి చెప్పడం అందరికి నచ్చడంతో సినిమా మొదలుపెట్టాము. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్ అందరికి థాంక్స్. థమన్ ఈ సినిమా కోసం మంచి సాంగ్స్ ఇచ్చాడు. బన్నీ వాసు, ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను సపోర్ట్ మరువలేనిది. నాకోసం చెప్పిన వెంటనే సిక్స్ ప్యాక్ చేసుకొని తేజ్ ఈ సినిమా తీసాడు. చిరంజీవి గారికి నేను కథ చెప్పినప్పుడు నచ్చింది, అలాగే ఆయన ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. సత్యరాజ్ గారు కథ విని ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నారు, సెట్స్‌లో చాలా ఓపిగ్గా యాక్ట్ చేశారు, ఆయన్ను ధన్యవాదాలు తెలిపారు.

రాశిఖన్నా మాట్లాడుతూ.. ‘అభిమానులకు, ఆడియన్స్ అందరికి నమస్కారం. మారుతి గారు మంచి కథ రాయడంతో పాటు బాగా తీశారు. నాపై నమ్మకం పెట్టి నాకు ఈ రోల్ ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను ఎప్పటినుండో సపోర్ట్ చేస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. గీతా ఆర్ట్స్ లో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. తేజ్ ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాడు. మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు.

నరేష్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానులందరికి నమస్కారం. మారుతి సినిమా అంటేనే పండగ, సాయి తేజ్, బన్నీ వాసు, అల్లు అరవింద్ వీరందరూ కలిస్తే ఇంకా పెద్ద పండగ. నా సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన ఒక బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాను. మారుతి చెప్పిన వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా థియేటర్స్‌లో ప్రతి రోజు పండగే’ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ..‘బన్నీ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మారుతి మొదటిసారి ఈ కథ నాకే చెప్పాడు, నాకు బాగా నచ్చిన కథ ఇది. శతమనంభవతి సినిమా అంత పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘సాయి ధరమ్ తేజ్‌తో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది, తాను చాలా హార్డ్ వర్కర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి. మారుతి సెంటిమెంట్, కామెడీ ను బాగా బ్యాలెన్స్ చేసి మూవీ తీశాడు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అని తెలిపారు.

Prathi roju Pandaga Pre Release Event...:

Prathi roju Pandaga Pre Release Event..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs