Advertisement
Google Ads BL

RRR: చెర్రీ ఏంటిది.. సెట్‌లో క్లాస్ పీకిన జక్కన్న!


బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు 70% సినిమాకు పైగా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోవచ్చినప్పటికీ ఇప్పటికీ సింగిల్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు కానీ.. లెక్కలేనన్ని పుకార్లు మాత్రం పెద్ద ఎత్తునే షికార్లు చేస్తున్నాయి. తాజాగా.. మరో ఇంట్రెస్టింగ్.. మెగాభిమానులకు కాస్త కోపం తెప్పించే వార్త వెలుగుచూసింది.

Advertisement
CJ Advs

అదేమిటంటే.. సెట్స్‌లో మెగా హీరో రామ్‌చరణ్‌కు జక్కన్న క్లాస్ తీసుకున్నాడట. ఎందుకంటే.. షూటింగ్‌లో సరిగ్గా పాల్గొనకపోవడం.. చెప్పిన మాటలు కాస్త బేఖాతరు చేయడంతో ఇక చేసేదేమీ లేక కూర్చోబెట్టుకుని గట్టిగానే క్లాస్ పీకారట. వాస్తవానికి మెగా తనయుడు రామ్ చరణ్ కారణంగానే చాలా రోజుల పాటు షూటింగ్ వాయిదా పడిందనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్‌లో గాయపడటం.. ‘సైరా’ ప్రొడక్షన్, ప్రమోషన్‌పైనే దృష్టిపెట్టడం.. అది కాస్త రిలీజ్ అయ్యి సూపర్ హిట్టయ్యాక.. ఇప్పుడు మళ్లీ కొరటాల-చిరు కాంబోలో వస్తున్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు రావడంతో అటు ఇటూ.. ఇలా రెండు పడవలపై కాలేస్తే ఎలా చెర్రీ..? ఏంటిది..? బిజినెస్.. బిజినెస్సే కానీ ఇలా అస్తమానూ షూటింగ్ ఆపడం సబబు కాదని.. ఇక్కడ కూడా శ్రద్ధపెట్టాలని చెప్పారట.

అయితే భారీ చిత్రం కావడం.. ఇదే సినిమా హిట్టయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తనపేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతుంది గనుక చెర్రీ కూడా ఇక నిర్మాణాలకు (సినిమా ప్రొడ్యూసర్‌) కాస్త గ్యాప్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం RRR షూటింగ్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. ఆయన సైడ్ అవ్వడంతో చిరు సినిమాను సహ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ చూసుకుంటోందని సమాచారం. ఇప్పటి వరకూ ఈ భారీ బడ్జెట్ సినిమాపై వచ్చిన పుకార్లపై స్పందించని చిత్రబృందం.. ఈ పుకార్లపై అయినా స్పందిస్తుందో..? కనీసం చెర్రీ అయినా రియాక్ట్ అవుతాడో లేదో జస్ట్ వెయిట్ అండ్ సీ..!

Jakkanna Takes Class To Cherry Over RRR Movie!:

Jakkanna Takes Class To Cherry Over RRR Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs