Advertisement
Google Ads BL

బాలయ్య మూవీకి హీరోయిన్, విలన్ ఫిక్స్!


‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 గా మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ షాట్‌ లోనే ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పారు కూడా. అయితే.. బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు..? బాలయ్యను ఢీ కొట్టేదెవరు..? అనే విషయాలు మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. అసలు విషయాలు బయటికి రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయ్.

Advertisement
CJ Advs

హీరోయిన్ల విషయానికొస్తే.. త్రిష, శ్రియ, అనుష్క, నయనతార ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. వీళ్లే కాదు.. వేదిక, సోనాల్ చౌహన్‌.. మరీ ముఖ్యంగా మహానటి కీర్తి సురేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇవన్నీ అటుంచితే.. ఏకంగా బాలీవుడ్ బ్యూటీనే పట్టుకురావాలని భావించిన బోయపాటి.. సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు వార్తలు గుప్పుమన్నాయ్. అయితే అవన్నీ పుకార్లో.. లేకుంటే బాలీవుడ్ బ్యూటీ కూడా ఒప్పుకోలేదేమో కానీ.. తాజాగా ‘సరైనోడు’ సినిమాలో యంగ్ ఎమ్మెల్యే నటించిన కేథరిన్‌ను బోయపాటి అండ్ బాలయ్య ఫైనల్ చేశారట. కేథరిన్ బోయపాటి సంప్రదించగానే ఓకే చెప్పేసిందట. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో కీలక పాత్రలో..  ‘జయ జానకి నాయక’ లోనూ ఐటెంసాంగ్‌లో నర్తించి మెప్పించింది.

ఇక బాలయ్యను ఢీ కొనేదెవరు..? అనే విషయానికొస్తే.. ఇంతవరకూ సంజయ్ దత్‌ను తీసుకున్నారని టాక్ వచ్చినా.. అబ్బే వాళ్లకు అంతంత రెమ్యునరేషన్ ఇచ్చుకోవడమేంటి..? అవసరమా..? అని భావించిన దర్శకనిర్మాతలు అటు హీరోగా.. అప్పుడప్పుడు విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ హీరో శ్రీకాంత్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంటే బాలయ్యతో శ్రీకాంత్ తలపడనున్నాడన్న మాట. అయితే సంజయ్‌దత్‌ను మెయిన్ విలన్‌గా.. రెండో విలన్‌గా శ్రీకాంత్‌ను తీసుకోవాలని కూడా యోచిస్తున్నారట. మరి ఫైనల్‌గా బాలయ్యను ఎవరు ఢీ కొంటారో..? బాలయ్యతో ఎవరు రొమాన్స్ చేస్తారో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Heroine and Villain Fix For Balayya- Boyapati Movie:

Heroine and Villain Fix For Balayya- Boyapati Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs