Advertisement
Google Ads BL

రేణూ దేశాయ్ నరకం నుంచి బయటికొచ్చింది!


‘రేణూదేశాయ్ నరకం నుంచి బయటికొచ్చింది’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. టాలీవుడ్ వివాదాస్పద నటి, కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఇక విర్రవీగిపోతుంటుంది. అలా నిత్యం ఏదో ఒక విధంగా పవన్ గురించి కామెంట్స్ చేస్తూ.. ఇన్ని రోజులూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల నోళ్లలో నానింది. అయితే చెన్నై వెళ్లిన తర్వాత ఇక్కడి విషయాలు పెద్దగా పట్టించుకోకుండా సాఫీగానే సినిమాల్లో చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఫ్యాషన్‌ షోలో హాట్ హాట్‌గా దర్శనమిస్తూ తన ఫాలోవర్స్‌ను.. వీరాభిమానులను ఆనందపరుస్తోంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా.. మరోసారి పవన్ గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్‌తో విడాకులు తీసుకున్న రేణూదేశాయ్‌‌‌ గురించి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. ఇన్ని రోజులూ రేణూ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే దిశ ఘటన అనంతరం ఎక్కువగా మీడియాలో.. సోషల్ మీడియాలో రేణూ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మాటలు విన్నాక శ్రీరెడ్డికి గుర్తొచ్చిందేమో కానీ.. ఆమె గురించి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘రేణు దేశాయ్ గారూ బెస్ట్ ఆఫ్ లక్.. మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఓ నరకం నుంచి బయటికి వచ్చారు’ అంటూ శ్రీశక్తి పోస్ట్ చేసింది. 

ఈ పోస్ట్‌పై మరోసారి మెగాభిమానులు దుమ్ముదులిపేలా కామెంట్స్ చేస్తున్నారు. పరోక్షంగా పవన్ అనే నరకం నుంచి బయటికొచ్చారని ఈ హాట్ భామ.. రేణూను ఉద్దేశించి కామెంట్స్ చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఇన్ని రోజులుగా కామ్‌గా ఉన్న సోషల్ మీడియాలోకెక్కిన శ్రీరెడ్డి.. వచ్చీరాగానే మెగాభిమానుల నుంచి చీవాట్లు తిన్నది.. మరోవైపు ఆమె మాత్రం అస్సలు తగ్గేది లేదన్నట్లు పోస్ట్‌లు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే కనీసం తిన్న అన్నం కూడా శ్రీ రెడ్డికి అరిగేలా కనిపించట్లేదంటూ పలువురు జనసేన కార్యకర్తలు సెటైర్లేస్తున్నారు. కాగా.. తనపై పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేసినా అస్సలు ఊరుకోని రేణూ.. శ్రీరెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Controversy Queen Sri Reddy FB Post On Renu Desai:

Controversy Queen Sri Reddy FB Post On Renu Desai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs