Advertisement
Google Ads BL

పుకార్లే నిజం:చిరు మూవీలో ఈ బ్యూటీనే హీరోయిన్


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ రిలీజ్ తర్వాత.. ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరుగాంచిన కొరటాల శివతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రానికి సంబంధించి ‘ఇదిగో కథ..’.. ‘మ్యూజిక్ డైరెక్టర్ మారారు..’ ‘దేవీ శ్రీని పక్కనెట్టి బాలీవుడ్‌ను పట్టుకొచ్చారు..’, ‘ఇదిగో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది..’, ఇదిగో విలన్ పేరు పక్కాగా ఫిక్సయ్యింది అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వినవచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి పోయిందీ లేదు.. ఈ రూమర్స్‌పై ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇటు మెగా కంపౌండ్ నుంచి.. అటు కొరటాల కంపౌండ్ నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేదు.

Advertisement
CJ Advs

చిరు సరసన నయనతార, కాజల్, తమన్నా, హ్యుమ ఖురేషి పేర్లు ప్రచారం జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఏకంగా త్రిష పేరే వినడింది. అయితే చిరు-త్రిష ఇద్దరూ కలిసి ఇదివరకే స్టాలిన్ సినిమాలో నటించారు. వీరి రొమాన్స్‌కు, చిరు సరసన నటనకు త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. అయితే చిరు సరసన త్రిష పక్కా అని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లే అక్షరాలా నిజమయ్యాయి. ఎందుకంటే.. చిరు సరసన నటిస్తున్నట్లు స్వయంగా ఈ ముదురుభామే ఒప్పేసుకుంది.

ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు త్రిష ఫలానా సినిమాల్లో నటిస్తోంది.. ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలతో అభిమానుల్లోకి రానుంది.. అని ట్వీట్ చేశారు. అందులో ఒకటి మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’,  రెండో సినిమా మోహన్‌లాల్‌తో.. మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ సినిమాలో నటించబోతున్నట్లు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్‌‌ చూసిన ముద్దుగుమ్మ త్రిష వెంటనే స్పందించింది.

ఎస్.. అని ఈ భామ ఒప్పేసుకుంది.  అదెలాగంటే విక్టరీ సింబల్‌ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసి #2020 అనే హ్యాష్‌టాగ్‌ను త్రిష ట్యాగ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే చిరు సరసన నటించేది ఈ భామేనని స్పష్టంగా తెలిసిపోయిందిగా. మొత్తానికి చూస్తే.. ఇన్ని రోజులుగా చిరు సరసన నటించే అదృష్టవంతురాలు ఎవరు..?  అనే సందిగ్ధానికి తెరపడిందన్న మాట. కాగా టాలీవుడ్‌లో ఓ మంచి సినిమాతో అడుగుపెట్టాలనుకున్న త్రిషకు చిరు సినిమాతో ఆ అవకాశం దక్కిందన్న మాట. మరి సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో..? కొరటాల నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Chiru-Koratala Combo Heroine Fix.. Details Here..!:

Chiru-Koratala Combo Heroine Fix.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs