Advertisement
Google Ads BL

చిరు పెద్ద కుమార్తె ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది!


కొణిదెల చిరంజీవి ఎన్నెన్ని కష్టాలు పడి స్వయంకృషితో పైకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కుటుంబం నుంచి చిరు తర్వాత వచ్చిన వారందరికీ ఆయన వారధిలాగా ఉండి.. వాళ్లందర్నీ ఒక స్థాయికి చేర్చారు. అయితే వీళ్లలో కొందరు బాగా సెట్ అవ్వగా.. మరికొందరు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఇదిలా ఉంటే రెండో జనరేషన్‌గా వచ్చిన వాళ్లు కూడా దాదాపుగా సెటిల్ అయ్యారు.. ఇంకొందరు లైన్‌లో ఉన్నారు కూడా. అయితే ఈ ఇంటి నుంచి వచ్చిన ఆడపడుచులు మాత్రం అస్సలు క్లిక్ కాలేకపోయారు. నిహారిక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని భగీరథ ప్రయత్నాలు చేసినప్పటికీ అన్నీ అట్టర్ ప్లాపే అయ్యాయి.

Advertisement
CJ Advs

అయితే.. చిరు పెద్ద కుమార్తె సుష్మిత మాత్రం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. మెగాస్టార్ రాజకీయాలకు టాటా చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహా రెడ్డి’ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాదు.. ఇప్పటికే సుమారు డిజైనర్‌ ఏడెనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అటు అత్తింటివారు.. ఇటు పుట్టింటి వారు బాగా స్వేచ్ఛ ఇస్తూ సపోర్ట్ చేయడంతో ఈమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగానే లైఫ్‌ను సాగిస్తోంది. కాగా.. ఇప్పటికే గీత ఆర్ట్స్ తర్వాత మెగా ఫ్యామిలీలో చాలా వరకు సొంత కుంపటి అనగా.. ప్రొడక్షన్ హౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇన్నిరోజులుగా డిజైనర్‌గా చేసిన సుష్మిత కొత్త బిజినెస్‌లో అడుగులేయాలని భావిస్తోందట. అంటే ఈమె కూడా సొంత కుంపటి అన్న మాట.

సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని.. వెబ్ సిరిస్‌తో పాటు చిన్న చిన్న సినిమాలు నిర్మించాలని ఆమె యోచిస్తోందట. అలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే స్థాయికి వెళ్లాలని గోల్‌గా పెట్టుకుందట. అంతేకాదు.. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌కు చెందిన కథలు వింటోందని త్వరలోనే ఓ మంచి కథను సోది లేకుండా సింపుల్ చేసి ట్రయిల్స్ వేయాలని భావిస్తోందట. కాగా.. ఇప్పటికే సినిమాల్లో రాణించలేకపోయిన నిహారిక కూడా వెబ్ సిరీస్‌లు చేసుకుని గడిపేస్తోంది. ఇప్పటి వరకూ నిహారిక ఫర్లేదు అనిపించుకుంది.. మరి ఇప్పటి వరకూ డిజైనర్‌గా రాణించిన.. ప్రొడక్షన్స్ వైపు అడుగులేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సుష్మిత ఏ మాత్రం రాణిస్తుందో..? అసలు ఈ కొత్త బిజినెస్‌ విషయంలో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

chiranjeevi elder daughter sushmita all set to her debut in Tollywood-:

chiranjeevi elder daughter sushmita all set to her debut in Tollywood-  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs