Advertisement
Google Ads BL

‘ప్రతిరోజూ పండగ’ చేయడానికి బన్నీ వస్తున్నాడు!


మెగా హీరో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా నటీనటులుగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇప్పటి వరకూ రిలీజ్ లుక్స్, ట్రైలర్‌ను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెల 20వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీస్థాయిలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది. కాగా.. ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 15న నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ మాదాపూర్ నందు ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
CJ Advs

ఈ ఈవెంట్‌కు చీప్ గెస్ట్ ఎవరు అనే విషయమై యూనిట్ సభ్యులు ఇంకా తెలియరాలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్‌లలో ఎవరినో ఒకరిని ముఖ్య అతిథిగా పిలవాలని భావించినప్పటికీ ఇద్దరు ప్రస్తుతం బిజిబిజీగా ఉండటంతో చెర్రీని సంప్రదించగా.. ప్రస్తుతం ఆయన కూడా బిజిబిజీగా ఉండటంతో చివరికి బన్నీనే ఫిక్స్ అయ్యాడని టాక్ నడుస్తోంది. అయితే బన్నీ వస్తాడన్న వార్తల్లో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

Bunny Chief Guest for Sai Dharam Tej?:

Bunny Chief Guest for Sai Dharam Tej?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs