Advertisement
Google Ads BL

పబ్లిసిటిలో దూసుకెళ్తున్న ‘మత్తు వదలరా’ టీమ్..


సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న  చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. కాగా ఈ చిత్ర పబ్లిసిటిని వినూత్నంగా ప్లాన్ చేశారు చిత్రం బృందం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వైవిధ్యమైన ప్రచారానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద శ్రీకారం చుట్టడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ వైవిధ్యమైన పబ్లిసిటి క్యాంపెయిన్‌కి అందర్ని నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ  ప్రేక్షకులకు చిత్రం చేరువ కావడానికి పబ్లిసిటిని వినూత్నంగా చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకే ఈ చిత్ర పబ్లిసిటిని సరికొత్త పంథాలో ప్లాన్ చేశాం.ఇటీవల మెగా పవర్‌స్టార్ విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుందన్నారు. 

నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

Mathu Vadalara Teams Speed Up with Publicity:

Mathu Vadalara Teams Speed Up with Publicity  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs